దానం -ధర్మం మహిమ బెల్లంకొండనాగేశ్వరరావు-చెన్నై . "బాలలు"ధర్మం"అనేపదం"దృఞ్ "అనేధాతువునుండివచ్చింది.ఈవిధంగా చేయాలి అని పురికొల్పేవిధిని "ధర్మం"అంటారు.మనుధర్మశాస్త్రంలో ధృతి-క్షమ-దమం-అస్తేయం-శేచం-ఇంద్రియనిగ్రహం-ధీ-విద్యా-సత్యం-అక్రోధం అనిపదిరకాలధర్మాలు చేప్పబడ్డాయి.మనిషి ధర్మమార్గంలోనడవాలంటే "హస్తస్య భూహణందానం.. సత్యం కంఠస్త భూషణం..శ్రోత్రస్య భూషణంశాస్త్రం. చేతికిదానం,నొటికి సత్యవాక్యం,చెవికి ధర్మశాస్త్రవచన పలుకులే భూషణంఅంటాడు అచార్య చాణిక్యుడు. నాలుగుపాదాలతో ధర్మంనడవడంఅంటే మోదటిపాదం సత్యం.రెండోపాదం శుచి శుబ్రతలు.మూడవపాదందయ.నాలుగోపాదందానం.వృధాప్యంలో తల్లితండ్రి వంటిపెద్దలనుపోషించడం బిడ్డలధర్మం. ఆకొన్నకూడె అమృతము తాకొందకఇచ్చువాడే దాత ధరిత్రిన్ సోకోర్చువాడె మనుజుడు తేకువ గలవాడే వంశతిలకుడు సుమతి ! ఆకలివేసినపుడు అన్నమే అమృతము.దానంచేసినవాడే దాత.ఆవేశము అణచుకొన్నవాడు,ధైర్యం కలవాడే వంశశ్రేష్ఠుడు. కౌశికుడు అనే తపస్వీ చాలాకాలంగొప్ప తపస్సు చేసాడు, ఒకరోజు అతనుతపస్సు చేసుకుంటున్న చెట్టు కొమ్మపైవాలిన కొంగ కౌశికునిపైరెట్ట వేసింది .తపోభంగంకలిగిన కౌశికుడు కోపంతో కొంగను తీక్షణంగా చూస్తాడు వెంటనే అతనిచూపుసోకినకొంగ భస్మమైపోతుంది. భిక్షాటనకువెళ్ళిన కౌశికుడు ఓఇంటిముందు భిక్షను అడుగుతాడు. తనభర్తకు సేవలుచేస్తున్న ఆయిల్లాలు కొద్దిసేపటి తరువాత ఆహరం తో కౌశికుని వద్దకువచ్చింది.తనను అంతసేపు ఎండలో నిలబెట్టినందుకుకొపంగాచూసాడు ఆమెను."స్వామి నేనుకొంగను కాను ధర్మబధ్ధంగా నడుచుకునే యిల్లాలిని నాపతికి సేవ చేయడంవలన ఆలస్యం అయింది"అంది ఆమె.ఆమెమాటలువిని చేతులు జోడించిన కౌశికునికి సత్యం,శేచం,దానం,తపం,శమం,దాంతి,యశం,రిజ్ఞానయుక్తి వంటిధర్మలు మిధిలానగరంలోని మాంసవిక్రేత ధర్మవ్యాధుని వద్దతెలుసుకో" అనితెలిపింది.ధర్మవ్యాధుని కలసిన కౌశికుడు తనకు ధర్మంపైఉన్న సందేహలను అడుగుతాడు.వృత్తిధర్మన్ని నిర్వహిస్తూ నిజాయితీగా జీవించడం ధర్మమని ,తల్లితండ్రి సేవలవలన తనకు ధర్మసూక్ష్మం తెలిసిందని.వ్యాసమహభారతంలో యక్షుడు(యమధర్మరాజు) ధర్మరాజును యిలా అడుగుతాడు.సూర్యుడు దేనిచే అస్తమిస్తాడు-ధర్మంచేత.సూర్యునికి ఆధారంఏమిటి?-సత్యం.మరణించినవానికి చుట్టమెవరు-దానం(ధర్మం)ధర్మానికికుదురుఏది-దాక్షిణ్యం(దయ).స్వర్గలోకానికి దారిఏది-సత్యం,అన్నిధర్మలలో నూ గొప్పధర్మమేది-అహింస .ఈప్రశ్నలుఅన్నింటికి ధర్మరాజు సమాధానాలు తెలిపాడు.శౌనకుడు ధర్మరాజుకు,వ్యాసుడు ధృతరాష్రునకు,మైత్రేయుడు ధుర్యోధనునికి,యిలాఎందరో మహనీయులులోకకల్యాణానికి ధర్మన్నిబోధించారు.వేదవిహితములు-శాస్త్రవిహితములు-శిష్టచరితములు అనే ఈమూడు విధ ధర్మలుకూడా మనిషిని సన్మర్గంలోనడిపిస్తాయి." జాలి,దయా,కరుణ,పాపభీతి, దానం అభయం,ఆదరణ,సేవ,వంటిపలులక్షణాలు ధర్మ నిర్వాహణలోనిభాగాలేఅని అన్నాడు .జ్ఞానోదయంకలిగిన కౌశికుడు తన తల్లితండ్రిసేవలో ధర్మమార్గానతరించాడు.


కామెంట్‌లు