1. మీ పిల్లలు పదో క్లాసు లోపు వారయితే, వారికి ఏయే సబ్జెక్ట్‌లు ఉన్నాయో మీకు స్పష్టంగా తెలుసా? 2. పిల్లల చదువు గురించీ, వాళ్ళకున్న జనరల్ నాలెడ్జ్ గురించీ కనీసం వారానికి ఒక్కసారైనా వారితో మాట్లాడుతారా? 3. మీ పిల్లలకి ఏ ఏ సబ్జెక్ట్‌లు ఇష్టమో, ఏవి కష్టమో, వేటిలో ఇబ్బంది పడుతున్నారో, క్లాస్‌లో వాళ్ళ స్టాండర్డ్ ఏమిటో, ఏ మార్కులతో పాస్ అవుతారో మీకు క్షుణ్ణంగా తెలుసా? 4. వారు ఏయే సబ్జెక్ట్‌లలో బలహీనంగా ఉన్నారో, దానికి పరిష్కారంగా ఓ ట్యూషన్‌ టీచర్ని పెట్టి మీ బాధ్యత తీరిపోయిoదని అనుకుoటున్నారా? 5. మీ పిల్లల ఆహారపు అలవాట్లు, వారానికి ఎన్నిసార్లు బయట జంక్-ఫుడ్ తింటారో... వగైరా మీకు తెలుసా? 6. మీ పిల్లవాడు టీన్ అయితే, కాంపిటిటివ్ పరీక్షల గురించీ, ప్రవేశ పరీక్షల గురించీ తెలుసుకునే ప్రయత్నం మీరు ఈ పాటికే ప్రారంభించారా? 7. ‘భవిష్యత్ చదువు/కెరీర్ గురించి మీ పిల్లల్ని సరిగ్గా గైడ్ చేస్తున్నాను’ అనే నమ్మకం మీకున్నదా? లేదా వినికిడి మాటల్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారా? 8. మీ పిల్లల స్నేహితుల/ స్నేహితురాళ్ళ కేరెక్టర్ గురించి మీకు కొద్దిగా అయినా అవగాహన ఉన్నదా? 9. టీ.వి., కంప్యూటర్ ఆటలు, చాటింగ్, సెల్‌ఫోన్‌పై సగటున మీ పిల్లలు రోజుకి ఎంతసేపు గడుపుతారో మీకు ఖచ్చితంగా తెలుసా? 10. పరీక్షలు అయిపోయిన తరువాత శలవుల్లో మీ పిల్లలు ‘ప్రొడక్టివ్’గా ఏం చెయ్యాలో మీకు అవగాహన ఉన్నదా? ప్రతి ఏడాదీ వారితో ఆ విషయం చర్చిస్తూ ఉంటారా? 11. మీ పిల్లలకి కొత్తగా పరిచయమవుతున్న నిరర్థక అలవాట్ల గురించి మీకు అవగాహన ఉన్నదా? అవి తగ్గించటం కోసం ప్రయత్నం చేస్తున్నారా? కనీసం ఆలోచిస్తున్నారా? 12. మీ పిల్లల వయసు ఇరవై దాటి ఉంటే, మీ నెల సంపాదన, అప్పులు, డిపాజిట్ల గురించి వారి కి ఉజ్జాయింపుగా తెలుసా? పై ప్రశ్నల్లో కనీసం ఆరింటికి మీ సమాధానం 'అవును' అయితే మీరు మంచి పేరెంట్- యండమూరి వీరేంద్రనాథ్


కామెంట్‌లు