టెన్షన్ తో నిరీక్షణ. --- 2 --------------------------------- ట్రైన్ దిగి శ్రీకాకుళం బస్సుకోసం ఎదురు చూస్తున్నాఎప్పటికీ రాదు. అక్కడ ఉన్నవారిని అడిగితే పావుగంట క్రితం ట్రైన్ రాకముందే ఒక బస్సు వెళ్లిపోయింది. తరువాత బస్సు వచ్చేసరికిమరో అరగంట,ముప్పావుగంట పడుతుం దన్నారు. పార్వతీపురం నుండి శ్రీకాకుళం వెళ్ళడానికి మూడు గంటలు పడుతుంది. బస్సు కరెక్ట్ గా వస్తే శ్రీకాకుళంవెళ్ళేసరికి పది, పదిన్నర అవుతుందనుకున్నాను. ఇంతలో టిఫిన్ చేసి వద్దామని నేనున్న స్థలానికి కొద్ది దూరంలో ఒక హోటల్ ఉంది. అది తప్పితే ఆ చుట్టుపక్కల ఏ హోటల్ లేదు. అక్కడకు వెళ్ళాను.ఆ పరిసర ప్రాంతమంతా దుర్గంధమైన కంపు. అది చూసిన తరువాత నా ఆకలి చచ్చిపోయింది. శ్రీకాకుళం వెళ్లి టిఫిన్ చెయ్యొచ్చనుకొని బస్సుకోసం తిరిగి వచ్చేసాను. అయితే ఆ హోటల్లో కంపును భరిస్తూ టిఫిన్ చేసినవాళ్ళూ లేకపోలేదు. టౌన్ రైల్వే స్టేషన్ గుండా ఇంతలో మరో ట్రైన్ విశాఖనుండి వచ్చి స్టేషన్లో ఆగింది. ప్లాట్ ఫారం నుండి దిగకుండా ఆ ప్రక్కనున్న ట్రాక్ గుండా చాలామంది అటూ ఇటూ పారి పోతున్నారు. అంటే వాళ్ళంతా టిక్కెట్ లేకుండా ట్రైన్ లో దొంగతనంగా ప్రయాణించిన వారై ఉండొచ్చని భావించాను. చిన్నతనంలో అంటే ఆరు, ఏడు సంవత్సరాల వయసులో రైల్లో మా నాన్నగారితో ప్రయాణం చేసాను. బుకింగ్ కౌంటర్ లో టిక్కెట్ తియ్యడానికి టైం లేదు. ట్రైన్ వచ్చి మేమున్న స్టేషన్ లో కదలడానికి సిద్ధంగా ఉంది. టిక్కెట్ కలెక్టర్ ఆ దగ్గరలోనే ఉంటే మానాన్నగారు కలిసారు."ట్రైన్ కదలిపోతుంది. ఎక్కండి. తరువాత మీదగ్గరకొస్తా!" అని చెప్పాడు. గానీ ఇంకెవరితోనో మరో కంపార్టుమెంట్ ఎక్కిపోయాడా టి టి ఇ. .ఎప్పటికీ టీ టీ ఇ మాదగ్గరకు రాలేదు. ఇంతలో మా స్టేషన్ వచ్చింది దిగిపోయాము. కనీసం మా స్టేషన్ లో అతను దిగినట్లు లేడు. ఇలా రైలు టిక్కెట్ లు తీయనివారు,( టైం లేని పరిస్థితులలో టిక్కెట్ తీయలేనివారు కొందరైతే, ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టినవారు కొందరున్నారు.అంతవరకూ అయితే మన ప్రయాణీకులు స్వార్థపూరిత మనస్థత్వం అను కోవచ్చు. టిక్కెట్ తీయని ప్రయాణీకుల నుండి డబ్బులు వసూలు చేసి జేబులు నింపుకున్న కొందరు అవినీతిపరులైన టీ టీ ఇ లున్నారు. చివరకు ఈ టీ టీ ఇ లు టిక్కెట్ లు తీయని పాసింజర్ లను స్లీపర్ కోచ్ లు, ఏ సి కోచ్ లలో ప్రయాణింపజేసి వారిని మగపెళ్ళివారికి చేసే మర్యాదలు చేస్తారు. దీని మూలంగా సీట్లురిజర్వేషన్లుచేయించుకున్న పాసింజర్ లు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఆ లంచ గాళ్ళకు, అవినీతిపరులకు తెలియదు రైల్వేశాఖ ఎన్నికోట్లు నష్టపోతుందోమరి ! ఇటువంటివాళ్ళనుంచి రైల్వేశాఖను, ప్రయాణీకులను రక్షించాలని ఆలోచనల్లో మునిగిపోయిన నాకు " అదుగోండి శ్రీకాకుళం బస్ వస్తుంది పదండి అన్నాడు తోటి ప్రయాణీకుడు. అప్పటికే రమారమీ ఏడున్నర దాటింది. బస్ చాలా రద్దీగా ఉంది. నేను శ్రీకాకుళం జిల్లాపరిషత్ ఆఫీసుకు వెళ్లే సరికి రమారమీ ఉదయం 11గం.లు అవ్వొచ్చనుకున్నాను. బస్ చాలా రద్దీగా ఉంది. ఎప్పటికి వెళ్తుందో అనే టెన్షన్ మొదలైంది. కూర్చునేందుకు సీటు ఇచ్చాడు ఒకాయన. వీరఘట్టంలో దిగిపోతానన్నాడతను. కండక్టర్ దగ్గర శ్రీకాకుళంకు టికెట్ తీసుకోవడం చూసినతను శ్రీకాకుళం వెళ్తున్నారా అని అడిగాడు. తెలిసికూడా చాలామంది ఎందుకిలా అడుగుతారో అర్థం కాదు. అతని సంశయాలను తీర్చేద్దామని అనుకొని అన్ని విషయాలు అడిగినా, అడగకపోయినా పూసగుచ్చినట్టు చెప్పాను. ఛైర్మన్ గారు ఈరోజు నాకు ఉపాధ్యాయునిగా ఉద్యోగంలో నియమిస్తూ ఆర్డర్ ఇస్తారు.అందుకే వెళ్తున్నా ననిచెప్పాను. " అయితే ఒక విషయం చెబుతున్నా వినండి. ఉద్యోగపు ఉత్తర్వులు మీ చేతిన పడేవరకూ ఎవరికీ చెప్పొద్దు. జిల్లా పరిషత్ ఛైర్మన్ గారు అభ్యర్థులకు ఉద్యోగం ఇవ్వాలా వద్దా అని నిర్ణయించడానికి నీలం, ఎరుపు, ఆకుపచ్చ ఇంకులు వాడుతుంటారు. అందులో ఒకటి మాత్రమే ఉద్యోగాన్ని ఇవ్వమని చెబుతోంది. మీకు ఏ రకమైన ఇంకు వాడారో. తెలుసా?" అని అడిగాడతను. తెలియదన్నాను. నాలో టెన్షన్ మొదలైంది. గుండెళ్ళో దడ మొదలైంది. ఉత్సాహం నీరుగారిపోయింది. ఆనందం మటుమాయమైంది.కొంతసేపు మౌనం నాలో ఆవహించింది. ఇందులో ఇన్ని మతలబులుంటాయండీ అన్నాను.రాజకీయ నాయకులంటే ఏమనుకుంటున్నారో మీరు.వారు చెప్పేవన్నీ నూటికి నూరు పాళ్ళూ నిజాలని నమ్మేయ కండి. ఆ క్షణానికి మన నుండి తప్పించుకోడానికి ఏవేవో చెబుతుంటారు.మీరు కుర్రాళ్లు. అనుభవం అలా కొద్ది కొద్దిగావస్తుంది లెండి. ఇంకేవేవో చెప్పబోతుండగానే వీరఘట్టం వచ్చేసింది. అతను దిగిపోయాడు. అతను దిగి వెళ్లిపోయాడేగానీ నా ఆలోచనలు ఆగలేదు.అలా నిద్రలోకి జారుకున్నాను. కొంత సేపటికి శ్రీకాకుళం చేరుకున్నాం. పదకొండు గంటలైంది సరిగ్గా ! జిల్లా పరిషత్ ఎడ్యు కేషన్ ఆఫీసర్ (పి ఇ ఓ )గారు10 గంటలకే ఆఫీసుకు వచ్చేసి ఉంటారు, నేనే ఆలస్యమైపోయాననుకొని గాబరా పడ్డాను. జిల్లాపరిషత్ ఆఫీసుకు ముందుగా వెళ్లి పి ఇ వో గారు ఆఫీసుకు వచ్చారోలేదోనని ఆరాతీయడానికి పల్లి శివున్నా యుడుగారు చెప్పిన ఎడ్యుకేషన్ గుమస్తా సత్యనారాయ ణను కలిసి నన్ను నేను పరిచయం చేసుకున్నాను అతనితో. పి ఇ వో ఒక అరగంటలో వస్తారు. తరువాత అతనిని కలవండి అన్నాడాయన. జిల్లా పరిషత్ ఆఫీసుకు ఆపోజిట్ సైడున పూరిగుడిసె టీ కొట్టు ఉండేది. అక్కడ కూర్చొని ఒక ప్రక్క టీ త్రాగుతూ మరో ప్రక్క పి ఇ వో గారొస్తారేమోనని కాసుక్కూర్చున్నాను.సాయంకాలం వరకూ పి ఇ వో గారి గురించి నిరీక్షణ అయ్యింది. ఆ రోజు మొత్తంపై నేనుభోజనం కూడా చేేేయయలేదు. పి ఇ ఓ గారు మాత్రం ఆఫీసుకు రాలేదు (సశేషం) శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి= ఫోన్: 701 3660 252.
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
స్నేహితులు:- అరిగే ఉమా-ఎనిమిదవ తరగతి-ఆదర్శ పాఠశాల - వల్లాల
• T. VEDANTA SURY
ప్రశంస -అభినందన!!!:-డా.ప్రతాప్ కౌటిళ్యా-సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని.
• T. VEDANTA SURY
పెద్దలకు సహాయం:- -గులాం అస్ర నౌషీన్ -ఎనిమిదవ తరగతి-ఆదర్శ పాఠశాల - వల్లాల
• T. VEDANTA SURY
కొత్త సంవత్సరం:- నామ వెంకటేశ్వర్లు, S A తెలుగు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అయిటిపాముల,, నల్గొండ,
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి