భూమిపై తొలి విశ్వవిద్యాలయం నలంద.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. 'బాలలు ముందుగా భారతదేశాన్ని పాలించిన రాజులు విద్య, సాహిత్యం, లలితకళలు ఎలా ఆదరించారో తెలుసుకుందాం! పూర్వం,అంగ,వంగ,కంగ,కళింగ,మరాట,మాళవ,నేపాళ,మళయాళ, సింహళ,ద్రవిడ,కర్నాట,కుకుర,బర్బర,కైకేయ,కోసల,కిరాత,మత్స్యటెంకణ,కొంకణ,సౌరాష్ట్ర,పాండ్య,కురుష,విదేహ,ఘూర్జర,కాంభోజ,అవంతి,మహరాష్ట్ర,హోయ్సల,యవ్వణ,మగధ,సింధూ,కుకురుకా అవంతి,వరాట, గౌళ, కాశ్మీర, సమాజత,సంజాతకావంతి ,ఆర్యవర్తజనని...మఛ్ఛహ ,మకుర కాహళ అచల, హేమంత,సుపర్వ నుమనిస,దివిష,బర్హి ,స్ణరాజిత, మోగళ, నిక్షేత కుంజరసౌరెద,సుంకధ, కాశీ,చేది,వత్స,కురు, శూరసేన,అస్సక, గాంధార, కాంభోజ,అయోధ్య,చంపానగరం,కాంపిల్య,కౌశాంభి, చేది, మగధ, పాంచాల,మత్స్య పాండ్య,సింధూ,గాంధార, త్రిగర్త,మద్ర, మహిష్మతి,కేకయ, అవంతి,బాహ్లి,కాంభోజ,ఉలూక,వంటి వందలాది రాజ్యాలు అన్నినాటి మన భారత దేశంలో ఉండేవి హర్షవర్ధనుడు క్రీ.శ.647 మరణించాడు.ఇతని ఆస్ధానంలో దీర్ఘకాలంగా ఉన్న చైనా యాత్రికుడు హ్యూన్ త్సాంగ్,ఇతను పశ్చిమోత్తరంగుండా భారతదేశంలో ప్రవేశించాడు.కాశ్మీర్,సియాల్ కోట్,జలంధర్ మీదుగా కనోజ్ చేరుకున్నాడు.హర్షుని సన్మానాలు అందుకుని,ప్రయాగ,కాశీ,బుద్ధగయలు సందర్శించి,అస్సాం,బెంగాలు,ఒరిస్సా మీదుగా ఆంధ్రాలో నాగార్జున కొండను, శ్రీపర్వతాన్ని చూసి,కంచి వెళ్లి,మైసూర్ మీదుగా మహరాష్ట్రా వెళ్లి,చాళుక్య రాజధాని వాతాపి చూసి నలంద చేరుకున్నాడు.అతను భారతదేశం వదలివెళ్లే సమయంలో బుద్ధుని అస్తికలతో పాటు పలు తాళపత్రగ్రంధాలు ఇరవై గుర్రాలపై చైనాకు తీసుకు వెళ్లాడు. వోల్టేర్,పియరి డి సోన్నెరేట్,షెలింగ్,జాన్ హోల్వెల్ వంటి ఐరోపాలోని చాలామంది ప్రముఖ మేధావులు భారతదేశాన్ని"నాగరికత యొక్క ఊయల" గా పిలుస్తారు.మరియు భారతదేశం ప్రపంచంలోని దాదాపు ప్రతిపురాతన మరియు మధ్యయుగ నాగరికతతో మేధో సంబంధాలను పంచుకుంటుంది అనేది నిజం.రాజకీయ కారణాలవలన భారతదేశ చరిత్ర మరియు నాగరికత ప్రపంచంలో చాలాతక్కువగా అంచనా వేయబడింది. వాస్తవం ఏమిటంటే,ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే భారతదేశం జ్ఞానరంగంలో ఎంతో దోహదపడింది.పశ్చిమాన మధ్యధారా సముద్రం దగ్గర ఉన్న దేశాలనుండి తూర్పున చైనా సముద్రవరకు విద్యార్దులు భారత దేశంలో చదువుకోవడానికి వచ్చారు.కానీ ఏ భారతీయ విద్యార్ది చదువులకొసం ఈదేశంనుండి వేరే దేశం వెళ్లినట్లు చెప్పలేదు.క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంనుండిక్రీస్తుశకం 12 వ శతాబ్దవరకు అంతర్జాతీయ అభ్యాస ప్రదేశంగా భారతదేశం వెలుగొంది.ఎందుకంటే తక్షశిల,నలందా,మరియు విక్రమశిల, వంటి గొప్ప అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు మనకు ఉండేవి. ప్రిరంభ మధ్యయుగ కాలంలో ఈ విశ్వవిద్యాలయాలు కుప్పకూలిన తరువాత కూడా,భారతదేశం ముస్లిం ప్రపంచానికి గణితం,సంగీతం, చదరంగం,ఆయుర్వేద,రసాయనశాస్త్రం,జ్యోతిష్యశాస్త్రం,పంచతంత్రమరియు కొన్నిహిందూ గ్రంథాలు వంటి అనేక ప్రత్యేకమైన విషయాలను నేర్పించిన లేదా ఇచ్చినందున అంతర్జాతీయ అభ్యాస దేశంగా మనదేశంఉంది.ఇది అల్-బెరుని మరియుఅమీర్ ఖుష్రో వంటివారు స్పష్టంగా తెలిపారు. ప్రాచీన ప్రపంచంలో అలెగ్జాండ్రియాలోని ఏథెన్స్ మరియు మ్యూజియంలో లైసియం వంటి అనేక అభ్యాస స్తానాలు ఉన్నాయి.బైజాంటైన్ (క్రీ.శ.843లో స్ధాపించబడింది.)అల్-కరౌయిన్(క్రీ.శ.859)అల్ అజార్ (క్రీ.శ.975) బోలోగ్నా(క్రీ.శ.1088)పారిస్ (క్రీ.శ.1160)ఆక్స్ఫర్డ్.(క్రీ.శ.1167) కేంబ్రిడ్జి (క్రీ.శ.1209)పలాన్సియా(క్రీ.శ.1212)సలామాంకా(క్రీ.శ.1218)పాడుగా (క్రీ.శ.1222)టౌలౌ(క్రీ.శ.1229)మెదలైనవి మధ్యయుగ కాలానికి చెందిన ప్రసిద్ద విశ్వవిద్యాలయాలు.కాని వీటిలో ఏదీ అభివృధ్ధి చెందిన మౌలిక సదుపాయాలు మరియు పాఠ్యాంశాలు కలిగినటువంటి తక్షశిల, నలందా, విక్రశిలా వంటివి పైన చెప్పిన వాటిలో లేవు. అనాటికే భారతదేశంలో పలు విశ్వవిద్యాలయాలు ఉండేవి.అలెగ్జాండర్ దండయాత్ర నాటికే తక్షశిల ప్రసిద్ధిచెందింది.ఉజ్జయిని మరోకటి.దక్షణాన నాగార్జున కొండ విశ్వవిద్యాలయం క్రీ.శ.200ప్రాంతంలో అభివృధ్ధిచెందింది. అన్నింటిలోకి నలంద విశ్వవిద్యాలయం శిఖరోన్నతం అంటే అతిశయోక్తి కాదు.హర్షునికాలంలో విలసిల్లిన ఈవిశ్వవిద్యాలయం. ఇది గుప్తరాజులలో చివరివాడైన బాలాదీత్యుడు నలందా విశ్వవిద్యాలయంకు ప్రారంభోత్సవంచేసాడు.ఉత్తరాదిని పాలించిన రాజులు అందరూ నలందను ఆదరిస్తూనే వచ్చారు.హర్షవర్తనుడు ఇట్టిదాతలలో అగ్రగణ్యుడు.ఈవిశ్వవిద్యాలయంలో పదివేలమంది చదువుకునే అవకాశం ఉండేది.దేశ దేశాల విద్యార్ధులు,పండితులు ఇక్కడ చేరేవారు. అదొక అంతర్జాతీయ విశ్వవిద్యాలయం.బౌధ్ధతత్వశాస్త్రం తోపాటు,సాంఖ్యా, వైశేషిక,యోగ,తర్కమీమాంసాది దర్శన శాస్త్రాలన్నింటికి ఇక్కడఆచార్య పీఠాలు ఉండేవి.వ్యాకరణానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉండేది.ఆకాలంలో విద్యార్దులు చాలాదూరం వెళ్లి విద్య అభ్యసించేవారు. ఉదయన్తు శత సూర్యా: ఉదయన్తు శత మిన్దవ: నవీన విదుషాం వాక్యెై: నశ్యత్యాభ్యంతర: తమ: ఒక్కసారిగా నూరుగురు సూర్యులు ఉదయించినా,నూరుగురు చంద్రులు ఉదయించినా, మనిషిలోని అజ్ఞానం తొలగిపోదు.విజ్ఞులైన గురువుల ఉపదేశంవలనే అది తొలగిపోతుంది. విద్యలను 'అష్టాదశ'విద్యలుగా చెపుతారు. అవిఋగ్వేద, యజుర్వేద, సామ,అథర్వవేదాలు అనే నాలుగు వేదాలు. శిక్ష,వ్యాకరణము, ఛందస్సు,నిరుక్తము,జోతిష్యము,కల్ప,మీమాంస, న్యాయము, పురాణము,ధర్మశాస్త్రము మొదలగు వానితోకలసి పదునాలుగు విద్యలు. వీటికి ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంభీర్యము,అర్ధశాస్త్రములను జోడించితే అష్టాదశ విద్యలు అవుతాయి. కళ అంటే: చంద్రునిలోని పదహారవభాగమని,శిల్పమని అర్ధం. వృత్తి,శాస్త్రం,విద్య-ఏదైనా అభ్యాసన వేళ విద్య,ప్రయోగ వేళ కళ! కారణం-అదిసృజన! ఏకళా సృష్టికైనా అవసరమైన ఇతర ద్రవ్యాలు ఎన్నిఉన్నా అసలు అవసరమైన మూలద్రవ్యం నైపుణ్యం.అలాంటి నైపుణ్యంతో చేసిన పని ఏదైనా అందంగా ఉంటుంది.ఆనందాన్ని కలిగిస్తుంది.అప్పుడు అది కళ అవుతుంది. నలందావిశ్వవిద్యాలయ ద్వారపాలకులు సైతం మహాపండితులు. విద్యార్ధులను మొదట పరిక్షించేదివీరే.రేయింబవళ్లు వాద ప్రతివాదాలతో, చర్చలతో నలందా విశ్వవిద్యాలయం ప్రతిధ్వనిస్తుండేది.ఇక్కడ ఆచార్యులుగా స్థిరమత,ధర్మపాల,వసుభంధు,శీలభద్ర వంటి వారు ఉండేవారు.నాగార్జుని రచనలు ఎన్నో ఇక్కడ రక్షింపబడి పిమ్మట టిబెట్టు చేరుకున్నాయి. నలందాలో ఎనిమిది కళాశాలలు ఉండేవి.సుమిత్రా పాలకుడు, బలపుత్రదేవుడు నిర్మించిన కళాసాలలో రత్నసాగర,రత్నోదధి, రత్నరంజిక అనే మూడు గ్రంధాలయాలు ఉండేవి. చైనా, కొరియా, సుమిత్రా,జావా,సింహళ,మధ్యఆసియా నుండి వేలాదిమంది విద్యార్ధులు ఇక్కడకు తరలి వచ్చేవారు.అలా ప్రపంచానికి తొలుత విద్యాదానం చేసింది మన భారతదేశమే! ఇప్పుడు మనం మరలా కథలోనికి వెళదాము. బాలలు ఇక్కడ మన విద్యా విశిష్టత గురించి కొంత తెలుసుకుందాం! గెర్రిపెటో అనే చరిత్రకారుడు మనదేశం గురించి ఇలా అంటాడు. తూర్పు ఇరాన్ లోని ఉన్నత పీఠభూమి,టిబెట్ మరుభూములు మంగోలియా,మంచూరియాలు,ప్రాచీన చైనా-జపాన్ లు ప్రాధమిక నాగరిక దశలో జీవిస్తున్నా ఇండో చైనాదీవులు,మలయా ద్వీపం,ఇండోనేషియా-వీటన్నింటిలోనూ భారతదేశం తన శాశ్వితమైన ముద్రనువేసింది.ఆదేశం మతం మాత్రమేగాక,కళా, భాషా,సంస్కారలన్ని భారతీయప్రభావాన్ని కలిగి ఉన్నాయి. గుప్తరాజులకాలంలో,శాస్త్రీయవిజ్ఞానం గణనీయంగా వృధ్ధి చెందడం ఆ కాలం ప్రత్యేకత.అన్ని శాస్త్రాలకు మూలం గణితం.వ్యాపార అభివృధ్ధికి అత్యవసరం బీజగణితం.రేఖాగణితం మరీ ముఖ్యం.ఇవన్ని గుప్తరాజుల కాలంలో వృద్ధి చెందాయి. గణితశాస్త్రంలో సున్నా భారతీయులు ఏనాడో కనుగొన్నారు. భారతదేశంనుండి అరబ్ దేశాలమీదుగా ఆవిజ్ఞానం యూరప్ వెళ్లింది. క్రీ.శ.476 లో పాటలీపుత్రం(నేటి పాట్నా) లో ఆర్యభట్టు జీవించాడు.ఇతను ప్రసిధ్ధ ఖగోళ శాస్త్రజ్ఞుడు.భూమి తనచుట్టు తను తిరుగుతూ సూర్యుని చుట్టూ పరిబ్రమిస్తుందని కనిపెట్టినవాడు.గ్రహణాలను లెక్కగట్టాడు.దశాంశ గణిత పద్దతి ప్రవేశపెట్టాడు. ఇదేకాలంలో మరోశాస్త్రవేత్త వరాహిమిహిరుడు. ప్రకృతి విజ్ఞాన శాస్త్రాలను గురించి ఎంతో కొంత పరిశోధించి నూతన విషయాలు వెలికి తెచ్చాడు. చరకుడు,శుశ్రుతుడు అంతకుముందే ఉన్నారు.వైద్యశాస్త్రం,గుప్తరాజుల కాలం లో బాగా అభివృధ్ధి పొందింది.రసాయన,బౌతిక,విజ్ఞాన శాస్త్రాలు లేనిదే వైద్యశాస్త్రంలేదు. సింధూ నుండి అరబ్ వర్తకులు,శాస్త్రజ్ఞీలు భారతీయ సరుకులతోపాటు, ఇక్కడి విజ్ఞానాన్ని,తత్వశాస్త్రాన్ని బాగ్దాద్ చేరవేశారు.భారతీయవైద్యులు పెక్కుమంది క్రీ.శ.900లో,బాగ్దాద్ లో హరూన్ అల్ రషీద్ ఆస్ధానంలో ఉండేవారు.అరేబియన్ నైట్స్ కథలు ఈరాజు ఆస్ధానంనుండే ఉద్బవించాయి. \
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
స్నేహితులు:- అరిగే ఉమా-ఎనిమిదవ తరగతి-ఆదర్శ పాఠశాల - వల్లాల
• T. VEDANTA SURY
ప్రశంస -అభినందన!!!:-డా.ప్రతాప్ కౌటిళ్యా-సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని.
• T. VEDANTA SURY
కొత్త సంవత్సరం:- నామ వెంకటేశ్వర్లు, S A తెలుగు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అయిటిపాముల,, నల్గొండ,
• T. VEDANTA SURY
పెద్దలకు సహాయం:- -గులాం అస్ర నౌషీన్ -ఎనిమిదవ తరగతి-ఆదర్శ పాఠశాల - వల్లాల
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి