A Must Read for All the Parents మీ బిడ్డ మీకు తరచుగా అబద్ధాలు చెబుతుంటే, వారి అనుచిత ప్రవర్తన పట్ల మీరు చాలా కఠినంగా స్పందించడమే అందుకు కారణం. మీ పిల్లలు తమ తప్పుల గురించి మీతో చెప్పే, చర్చించే నమ్మకం మీరు కల్పించకపోతే, మీరు వారిని కోల్పోయినట్లే. మీ బిడ్డకు ఆత్మగౌరవం తక్కువగా ఉందంటే, మీరు వారిని ప్రోత్సహించడం కంటే సలహాలు ఎక్కువ ఇవ్వడమే కారణం. మీ బిడ్డ తమకోసం తాము నిలబడలేదంటే, చిన్న వయస్సు నుండే వారిని బహిరంగంగా క్రమశిక్షణలో ఉంచారని అర్థం. మీ పిల్లవాడు తమకు చెందని వస్తువులను తీసుకుంటున్నాడంటే, వారు కోరుకున్నదాన్ని ఎంచుకోవడానికి మీరు వారిని అనుమతించకపోవడమే కారణం. మీ బిడ్డ పిరికివాడైతే, మీరు వారికి అవసరానికి మించి త్వరగా సహాయం చేయడమే కారణం. మీ పిల్లవాడు ఇతరుల భావాలను గౌరవించకపోతే, మీ బిడ్డతో మాట్లాడటానికి బదులుగా, మీరు వారిని ఆదేశిస్తారని అర్థం. మీ బిడ్డ త్వరగా కోప్పడుతున్నారంటే, మీరు వారి మంచి ప్రవర్తనను పట్టించుకోకుండా చెడు ప్రవర్తనపై శ్రద్ధ చూపడమే కారణం. మీ బిడ్డకు అధిక అసూయ ఉందంటే, వారు ఏదైనా విజయవంతంగా పూర్తి చేసినప్పుడు మాత్రమే మీరు అభినందించారని, వారు మెరుగుపరచినప్పుడు పట్టించుకోలేదని అర్థం. మీ బిడ్డ ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని బాధపెడితే, మీరు ఆప్యాయంగా ఉండకపోవడమే అందుకు కారణం. మీ బిడ్డ బహిరంగంగా ధిక్కరించినట్లయితే, మీరు ఏదైనా చేయమని బహిరంగంగా బెదిరిస్తారని అర్థం. మీ బిడ్డ రహస్యంగా ఉంటుంటే, మీరు వారిని విశ్వసించకపోవడమే అందుకు కారణం. మీ పిల్లవాడు మీతో ఎదురు తిరిగి మాట్లాడితే, మీరు ఇతరులతో అలా చేయడాన్ని వారు చూడటం, దానిని సాధారణ ప్రవర్తన అనుకోవడమే కారణం. మీ పిల్లవాడు మీ మాట వినకపోగా ఇతరుల మాటలు వింటున్నారంటే, మీరు త్వరగా నిర్ణయాలు తీసుకోవడమే అందుకు కారణం. మీ బిడ్డ మీపై తిరుగుబాటు చేశారంటే, విషయంలో తప్పొప్పులకంటే ఇతరులు ఏమనుకుంటారన్న దానిపైనే మీరు ఎక్కువ శ్రద్ధ చూపిస్తారని అతనికి తెలుసు. ఇవన్నీ నేను రాసినవి కావు. దాదాపు 500 సంవత్సరాల కిందట తమిళకవి తిరువళ్లువార్ రాసిన తిరుక్కురల్ గ్రంధంలోనివి. ఇన్ని శతాబ్దాలైనా, ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ మానవ ప్రవర్తన మారలేదని తెలుస్తోంది. నిజమైన వ్యక్తిత్వ వికాసం, నిజమైన మార్పు ఇంట్లోనే మొదలవుతుంది. వీటిలో అన్నింటినీ కాకపోయినా కొన్నింటినైనా ప్రయత్నించండి. మీ కుటుంబ సంబంధాలలో సమగ్ర మార్పును గమనించండి. #PsyVisesh


కామెంట్‌లు