ఆధార్ కార్డులు, పాస్ బుక్ లూ అక్కడా ఇక్కడా పారేసుకుంటున్నారని మా పిల్లలందరికీ ఫోల్డర్స్ అందజేశాను.. శనివారం పదవతరగతి వీడ్కోలు సభ, పాఠశాల వార్షికోత్సవం సందర్భంగామళ్ళీ మా బడికి వెళ్ళాను.. వాళ్ళందరూ నా పదవీ విరమణ రోజున కానుకగా అందించిన చీర కట్టుకుని వెళ్ళాను.. పిల్లల కేరింతలు.. ఊరి వారి ఆత్మీయతలతో మనసు నిండిపోగా రోజంతా ఆనందంగా గడిచిపోయింది...- సమ్మెట ఉమా దేవి


కామెంట్‌లు