మాన్యులు రచన డి.సురేష్ బాబు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 మన భారతదేశంలో ఎందరెందరో మహామహులు జన్మించారు.వారివలన దేశవిదేశాల్లో మన భారతదేశపు కీర్తి ఎంతగానో విస్తరించింది. ఒకసారి హవాయి దీవుల్లో ప్రపంచ తత్వవేత్తల మహాసభ జరుగుతోంది.ఆ సభకు ప్రపంచం నలుమూలలనుండీ ఎందరో మేధావులు హాజరైయ్యారు.అలా హాజరైనవారిలో ఒక భారతీయ ప్రముఖుడు కూడావున్నాడు.తత్వవేత్తలతోనూ,ప్రజలతోనూ ఆ సభాప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది.కొంతమంది తత్వవేత్తలు మాట్లాడినతరువాత మన భారతీయతత్వవేత్త మాట్లాడడం ప్రారంభించారు.అతడి ప్రసంగానికి ఆ సభాప్రాంగణం చప్పట్లతో మారుమ్రోగిపోయింది.కేవలం భారతీయ తత్వవేత్త ఉపన్యాసంవినడానికి చైనానుండి ఒక వర్తకుడు ఆ సభకి వచ్చాడు.బయటేనిలబడి ,దాదాపుగా రెండుగంటలపాటు భారతీయతత్వవేత్త మాటలువిన్నాడతడు.ఆ ఉపన్యాసానికీ ముగ్దుడైనఆ చైనావర్తకుడు ,ఆసభానిర్వహణకైన ఖర్చునంతా తనంతతానుగా తానే భరించాడు. ఎప్పుడైనా,ఎక్కడైనా,ఎవరినైనా తనవాక్ చాతుర్యంతో మెప్పించగల ఆ మేటిదిట్ట ,గొప్పతత్వవేత్త,రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. పద్యం:——— భరత మాతయు నెంతయో భాగ్యశాలి కనక గర్భను కీర్తిని కలిగి యుండె జన్మ నిచ్చెను ఘనులకు జనని తాను మ్రొక్క వలెగద మాతకు ముదముతోడ పద్య రచన,కథ సేకరణ సత్యవాణి
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
స్నేహితులు:- అరిగే ఉమా-ఎనిమిదవ తరగతి-ఆదర్శ పాఠశాల - వల్లాల
• T. VEDANTA SURY
ప్రశంస -అభినందన!!!:-డా.ప్రతాప్ కౌటిళ్యా-సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని.
• T. VEDANTA SURY
పెద్దలకు సహాయం:- -గులాం అస్ర నౌషీన్ -ఎనిమిదవ తరగతి-ఆదర్శ పాఠశాల - వల్లాల
• T. VEDANTA SURY
కొత్త సంవత్సరం:- నామ వెంకటేశ్వర్లు, S A తెలుగు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అయిటిపాముల,, నల్గొండ,
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి