సుదగాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్ష సామాగ్రి పంపిణీ## యాద్రాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు యమ్ మండలం కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , కస్తూర్బా గాంధీ బాలికల విద్యార్థిని, విద్యార్థులకు బుధవారం సుదగాని ఫౌండేషన్ చైర్మన్ శ్రీ సుదగాని హరి శంకర్ గౌడ్ గారు ఎగ్జాజమ్స్ ప్యాడ్స్ మరియు పరీక్ష సామాగ్రి ని పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక యమ్.పి.టి.సి యాస కవిత ఇంద్రా రెడ్డి గారు , స్థానిక ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు భీష్మ రెడ్డి గారు, స్థానిక కస్తూర్బా బాలికల విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ పద్మ గారు, స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యాకమిటి చైర్మన్ కోరె. బీరప్ప గారు, ఎలగందుల మహేష్ గారు , పి.ఇ.టి మల్లం నర్సయ్య గారు, అధ్యాపక బృందం, గ్రామ ప్రముఖులు పాల్గొన్నరు


కామెంట్‌లు