అక్షరాలనే నమ్ముకున్న రచయిత --------------------------------------------- ఓ మారుమూల పల్లె నుంచి మద్రాసు మహానగరానికొచ్చి రచననే వృత్తిగా ఎంచుకున్న మనిషతను. ఎన్నో కష్టాలు అనుభవించినా వాటితోనే పయనిస్తూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న ఆయన రచనలన్నా ప్రసంగాలన్నా నాకు మక్కువెక్కువ. ఆయన పేరు ఎస్. రామకృష్ణన్. ఆయనతో ఒకటి రెండుసార్లే ఫోన్లో మాట్లాడాను. మద్రాసులో ఉంటున్న ఆయనను ఒక్కసారన్నా కలవాలని తాపత్రయం. వ్యాసమో కథో నవలో ఏదో ఒకటి రాస్తుండటం లేదా సాహిత్య సభలూ సమావేశాలకు హాజరవడం. ఇలా ఇరవై నాలుగ్గంటలూ పుస్తకప్రపంచంలోనే ఉండే ఆయన గురించి ఒకటి రెండు మాటలు. తాను చదివిన కథ బాగుండి నచ్చితే అది రాసిన రచయిత చిన్నా పెద్దా అనే దానితో సంబంధంలేకుండా వారిని అభినందించడం, కలవడం చేస్తుంటారు. తనకీ సంస్కృతి రావడానికి కారణం ఓ ఇద్దరు ముగ్గురు రచయితలేనని చెప్తుంటారు. తానొక కుగ్రామం నుంచి ఓ రచన చేస్తే అది చదివి ఆ మహారచయితలు తనుకు ఉత్తరం రాయడం ఎంత ఆనందం కలిగిందో చెప్పలేనంటారు. రచయితనేవాడు ఏదైనా రాయొచ్చనుకుంటాడు కానీ దాని మీద స్పందించవలసింది పాఠకుడు. అతనికి రచయిత ఎం గొప్పవాడో పెద్దవాడో అప్రస్తుతం. ఆ కథో నవలో తనను కట్టి పడేసిందా లేదా అనే చూస్తాడు. అదే తనకవసరం. చదివి కాలాన్ని వృధా చేయలేదుగా అనుకుంటాడంటారు రామకృష్ణన్. ఆయన ఓమారు ఒకరింటికి వెళ్ళారు. ఆయన వెళ్ళగానే లోపలికి ఆహ్వానించిన ఆ ఇంటి ఇల్లాలు అప్పటివరకూ కార్చిన కన్నీటిని తుడుచుకుంటూ వచ్చి కాఫీ ఇచ్చిన క్షణాలింకా మరచిపోలేదన్నారు. ఓరోజు ఆయన ఓ హోటల్దో టిఫిన్ చేస్తుండగా ఎదురుగా ఓ భార్యాభర్తలు కూర్చున్నారు. ఉన్నట్లుండి భర్త భార్యను కొట్టాడు. అప్పటివరకూ గోలగోలగా ఉన్న ఆ హోటల్ లో మౌనం చోటుచేసుకుంది. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. భార్యాభర్తల మధ్య గొడవలో జోక్యం చేసుకోకూడదన్న సంప్రదాయం మనదైనప్పటికీ నలుగురి మధ్యా ఇటువంటి సన్నివేశం చోటుచేసుకున్నప్పుడు దానిని ప్రశ్నించడం తప్పేమీకాదన్నది ఆయన మాట. కాస్సేపు తర్వాత అదే భర్త హోటల్ గుమ్మంలో పువ్వులు కొని ఆమెకిచ్చాడు. తనూ తీసుకుంది. కొట్టడం, అల్లంతలోనే ప్రేమ చూపడం మాటెలా ఉన్నా ఆమెను కొట్టినప్పుడు ఎదురుగా ఉండీ మిన్నకుండినట్లున్న నా వైఖరే నన్నెంతో గాయపరచిందంటారు రామకృష్ణన్. మరొకసారి ఆయన ఓ ఇంటికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన. ఆ రాత్రి భోజనాలై అక్కడే బస చేయవలసి వచ్చిందాయన తను తెచ్చుకున్న బట్టలను అక్కడే ఓ పక్కగా పెట్టి పడుకున్నారు. మరుసటిరోజు ఉదయం ఆయన లేచేసరికి తన బట్టలన్నీ ఉతికి ఆరేసి అవి ఎండేంత వరకూ ఆ ఇంట గడపాల్సి వచ్చింది. తాను ఆ ఇంటికి వెళ్ళింది అదే మొదటిసారి. పెద్ద పరిచయమూ లేదు. అయినా నా బట్టలెందుకు ఉతకడం. పైగా ఆ ఇంటి ఇల్లాలిని చూసిందీ లేదు. వంట గదిలోంచి ఒకటి రెండు మాటలు వినడమే. అటువంటామె తన బట్టలు ఎలా ఉతికింది. అక్షరంమీదున్న అభిమానం ఆమెతో ఇంత పని చేయించిందా?! కావచ్చంటారు రామకృష్ణన్. ఇలాంటి సంఘటనలనే ఆధారంగా చేసుకుని తన ప్రసంగాలలో చెప్తూ రాస్తూ ఓ స్థాయికి చేరిన ఎస్. రామకృష్ణన్ మాటేమిటంటే రచయిత అనే అతను రాస్తూ ఉండాలి ఓపిక ఉన్నంతవరకూ. ఆ రచన నలుగురినీ ప్రభావితం చేయాలన్నదే ఆయన అభిప్రాయం. ఓ కథకు మంచిపేరు వచ్చేసిందని అక్కడితో ఆగిపోవడం కాదు. అది అక్కడితో ముగిసిన అధ్యాయం. తర్వాత ఏం చేయాలన్న ఆలోచన ఉండాలి...రాయాలి అంటారాయన. ఆయనిలాగే తన రచనను సుదీర్ఘ కాలంగా కొనసాగించడం విశేషం. - యామిజాల జగదీశ్
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
స్నేహితులు:- అరిగే ఉమా-ఎనిమిదవ తరగతి-ఆదర్శ పాఠశాల - వల్లాల
• T. VEDANTA SURY
ప్రశంస -అభినందన!!!:-డా.ప్రతాప్ కౌటిళ్యా-సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని.
• T. VEDANTA SURY
పెద్దలకు సహాయం:- -గులాం అస్ర నౌషీన్ -ఎనిమిదవ తరగతి-ఆదర్శ పాఠశాల - వల్లాల
• T. VEDANTA SURY
కొత్త సంవత్సరం:- నామ వెంకటేశ్వర్లు, S A తెలుగు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అయిటిపాముల,, నల్గొండ,
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి