లిఖిత్ కుమార్ గోదా. రెక్కలు 1️⃣) పుస్తకాలను విడిచాడు, చైతన్యాన్ని వెతుకుతున్నాడు. నేటి మనిషి మేధస్సు ఇది! * * * * * * 2️⃣) దానాలలో కర్ణుడు ఘనుడు అన్నదానంలో రైతు ఘనుడు. మానవుడు గొప్ప కష్టశీలి,దానశీలి! * * * ‌ * * * 3️⃣) బ్రహ్మ చేస్తే మనిషి, మనిషి చేస్తే యంత్రం. అంతా సృష్టేగా! * * * * * * 4️⃣) ఉపమన్యుడు శివున్ని రప్పించాడు, ప్రహ్లాదుడు విష్ణువుని మెప్పించాడు. బాలలు భలే మేధావులు! * * * * * 5️⃣) మేధావి మాట్లాడతాడు. మూర్ఖుడు వాదిస్తాడు. మేధావికి, మూర్ఖుడికి భేదం ఇదే! * * * * * 6️⃣) ఆవేదన ఎందుకు ఆలోచిస్తే సాధ్యం. అది కవిత్వమైన, సమస్యలకు పరిష్కారాలైనా . ఆలోచిస్తేనే కదా ఏదైనా సుసాధ్యం. రచన:- లిఖిత్ కుమార్ గోదా(చిన్ని)


కామెంట్‌లు