పల్లవి గడగడ చదువుల చూడగ అడుగులు నాగెను నేలనో(పిల్లల) 1 పిల్లల పరుగులు పిలుపుల మధురిమ కల్లలు ఎరగని కైతల నవ్వులు మల్లెల తెలుపులు మాటల వానలు అల్లరి చేష్టలు అందెల రవళులు(గడగడ) 2. బరువులు మోయుచు భయపడు బాలలు వెరుపులు వలదనె వీరులు కొందరు మరవక చదివిన మంచిగ వచ్చును గురువుల మాటలు గుర్తుకు తెచ్చెను (గడగడ) 3 పరిపరి విదముల పైకము లడుగుచు సరుగున పోవలె సైకిల్ పైనని జరగక నిలిచిన జయమే కలిగెను మురియుచు సాగిరి మహిలో నపుడే (గడగడ) పెందోట వెంకటేశ్వర్లు సిద్దిపేట.


కామెంట్‌లు