చిన్న చిన్న చిట్కాలు -1-- ఒక్కొక్క సారి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మనకు నిద్ర పట్టకుండా చేస్తాయి అందులో కొన్నింటికి నివారణోపాయాలు . పంటి నొప్పి మనకు ఇబ్బంది కలిగిస్తుంది. నీళ్లలో మిరియాల పొడి వేసి గోరు వెచ్చగా చేసి పుక్కిలిస్తే నొప్పి తగ్గి పోతుంది. తులసి ఆకులు + లవంగాలు దంచి ముద్దగా చేసి పంటిపై ఉంచితే నొప్పి తగ్గిపోతుంది. చెవి పోటు వస్తే నువ్వుల నూనెలో ఇంగువ పొడి వేసి వేడి చేసి చల్లార్చి రెండు చుక్కలు చెవిలో వేస్తె చెవి పోటు తగ్గి పోతుంది. తులసి ఆకుల రసాన్ని కూడా వేడి చేసి చల్లార్చి చెవిలో వేస్తె చవి పోటు తగ్గి పోతుంది. గొంతు నొప్పి వస్తే త్రిఫలా చూర్ణంలో నీరు పోసి రాక్ సాల్ట్ వేసి గోరు వెచ్చగా చేసి గాదూష ప్రక్రియ (గార్గిలింగ్ ) చేస్తే నొప్పి తగ్గుతుంది. కడుపులో మంట వస్తే గులాబీ రెక్కలను శుభ్రంగా కడిగి మజ్జిగ లేదా పాలల్లో వేసి మిక్సీలో వేసి తిప్పి ఆ రసాన్ని తాగితే కడుపులో మంట తగ్గుతుంది. - పి .కమలాకర్ రావు


కామెంట్‌లు