బాల సాహిత్యం అంటే బాలలకు హితము కూర్చే సాహిత్యము. బాలల అంటే 10 లేక 12 సంవత్సరాల వయసు గల బాలలు. వీరిని పరిగణన లోకి తీసుకొని వచ్చును. బాల సాహిత్యం అనేది పసిపాపల రోదనల నుండి ఉద్భవించిందని చెప్పుకో వచ్చును. అన్యం పుణ్యం ఎరుగని పసిపాపలు రోదిస్తుంటే బుజ్జగించేందుకు పాడే పాటలు. వీరిని ఉయ్యాలలో వేసి గాని లేక ఒడిలో వేసుకొని పాడే లాలి పాటలు జోల పాటలు . కనులు తెరవని పసి కూనలు కూడా ఈ పాటలు విని మైమరచి నిదురింతురు. ఈ పాటలే బాలసాహిత్యానికి పునాదులు. 0-3 సంవత్సరాలు వయస్సు గల పసిపాపలు మొదటి దశ. ఈ దశలో సృజించే బాల సాహిత్యం ప్రాచీనమైనది. సనాతనమైన లాలి పాటలు జోల పాటలు అను శ్రుతంగా వస్తున్నాయి. శిశుర్వేత్తి పశుర్వేత్తి/, వేత్తి గానరసం పణిః/ గాన రసం వల్ల ఆనందం పారవశ్యం పొందే వాటిలో పశువులకు పాములకు ముందుగా శిశువులను పేర్కొంటారు. అయితే గీత సంగీతాలకు అవినాభావ సంబంధం ఉంది. పసివారికి పాటలకు ఉన్న బంధం అటువంటిదే! బాలసాహిత్యంలో పాటలకు అనగా బాల గేయాలకు ఉన్న ప్రముఖ స్థానం తెలియజేస్తుంది. పాప పుట్టగానే ఏడుపులో లీనమై అమ్మ శబ్దం ప్రభవిస్తుంది."ఆ"కారాభి వృద్ధి చెందుతుంది. ఆ ఆ ఆకారమే సంగీతమై త్వరగా ప్రాకడానికి,-అల్లుకునేఆధారం కోసం గీతం వెలుగుతుంది. ఏ పదం దొరికినా దానికి ఆధారం చేసుకుని సంగీతం విస్తరించి ఉంటుంది. పలికీ పలకలేని పదాలతో రాగం మేళవించి పసిపాపలు ఆడుకుంటూ ఊసులాడు కొనే దృశ్యం. ఈ సత్యం రుజువు చేయడం మనంతెలుసుకోగలం. అక్కడే పాటలు జనించడం ప్రారంభం అవుతుంది. పాలబుగ్గల పసిడి పాపలుపాడే పాటల లోని భాష,భావం మనకు అర్థం కాకపోయినా చిత్రంగా ఉంటుంది. పాప పాడింది పసిపాప పాడింది పాటలో.. ఆటలో.. పరవశించింది ఈ జగమంతా పరవశించింది... ... ... (తరువాత మూడు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల వరకు గల బాలలకు సాహిత్యం,)-- బెహరా ఉమామహేశ్వరరావు (ఎం.ఎ. ఎమ్.ఇడి)సెల్ :9290061336


కామెంట్‌లు