మన తెలుగు సాహిత్యం పదవ శతాబ్దం నుండి కావ్య రూపంగా ఆరంభమైందని సాహిత్యకారులు చెబుతుంటారు.ఆది కవి నన్నయ సంస్కృత మహాభారతాన్ని తెలుగులో అనువదించడం ద్వారా సాహిత్య గ్రంథ ఆవిష్కారమైందని చెప్పవచ్చును. అంతకుముందు గ్రంథాలు లేకపోయినప్పటికీ తెలుగు భాష మాత్రం వాగ్ రూపకంగా ఉండేదని చారిత్రకులు చెబుతారు. మరి కొందరు విశ్లేషకులు తెలుగు సాహిత్యం జానపద రూపంలో ఉండేదని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు లిపి లేకపోవడం, ఉండే లిపిని సంస్కరించే వారు లేక పోవడం వల్ల తెలుగు సాహిత్యం ఆవిర్భవించలేదని చెబుతారు.మరికొందరు కన్నడం తెలుగు ఏకరూప లిపితో ఉండేదని విశ్లేషిస్తారు. ఏది ఏమైనా ఈ వాదాలకు సరి అయిన చారిత్రక ఆధారాలు లేవని తెలుస్తుంది. అయితే ఆనాడు బాల సాహిత్యం అనేది సంస్కృత భాషలో ఉండేదని చెబుతారు. దీనికి సోదాహరణంగా చెప్పాలంటే ఏక శ్లోకి రామాయణం, ఏకశ్లోకి భారతం మరియు భాగవతం ఇలా చిన్నచిన్న శ్లోకాలే సాక్ష్యం. ఈ శ్లోకాలు బాలలకు నేర్పేవారు. మనం ఈ క్రింది శ్లోకం పరిశీలిద్దాం: శత నిష్కొ ధనాఢ్యశ్చ/శత గ్రామేణ భూపతిః/శతాశ్వః క్షత్రియో రాజా/ శత శ్లోకేన పండితః/ ఈ ఈ శ్లోకం ద్వారా ఆనాటి విద్య ఆర్థిక పరిస్థితులు మనకు తెలుస్తాయి. ఈ శ్లోకం అర్ధం ఏమిటంటే నూరు బంగారు వరహాలు ఉన్నవాడు ధనికుడు. 100 ఊర్లు ఉన్న వాడు భూస్వామి, 100 గుర్రములు గలవాడు రాజు, నూరు శ్లోకాలు వ్రాసిన వాడు పండితుడు నాడు నూరు శ్లోకములు కంఠోపాఠం అయినా పండితుడిగా నిర్ణయింప బడేవాడు. పిల్లలకి నేర్పే మరో మంచి శ్లోకం: ఉద్యమః సాహసం ధైర్యం బుద్ధిఃశక్తిః పరాక్రమః/యత్ర వర్తంతే తత్ర దేవః సహాయక్రృత్//అనగా ప్రయత్నము సాహసం ధైర్యము బుద్ధి శక్తి పరాక్రమము అను నీ ఆరును ఉన్నప్పుడే ఏడవదిగా దైవ సహాయము లభించునుఈ విధమైనటువంటి సంస్కృత శ్లోకాలు నాటి శిష్ట కుటుంబాలలో బాలలకు నేర్పే వారు. (తరువాత మరో శ్లోకం -బెహరా ఉమామహేశ్వర రావుసెల్ నెంబర్ 9290061336


కామెంట్‌లు