నైట్-వాచర్ తన ఇంట్లో దాచిపెట్టిన పాఠశాల సామగ్రీ గునపాం, పార, బొరిగెలు, బకెట్ మొదలగునవి పాఠశాలలో తెచ్చి పెట్టాడు. స్కూలుకు దగ్గరలోనే మొక్కలను పెంచే నర్సరీ ఉంది. పాతిక రూపాయలు ఇచ్చి ఇద్దరు టీచర్లను, నైట్ వాచర్ ను, గార్డెనర్ ను పంపాను. టీచర్స్ కు మంచి మంచి పువ్వుల మొక్కలను ఎంపిక చెయ్యిమన్నాను.పేడపెంట ' గెత్తం ' ఆ పరిసరప్రాంతాల్లో ఉన్న పెంట కుప్పల మీద నుండి తెచ్చి మొక్కలకు వెయ్యమన్నాను. ఇక్కడ ఎవరూ ఇవ్వరండయ్యా అంది గార్డెనర్. గార్డెనర్ కు ఈ పనులేమి చెయ్యడం ఇష్టం లేనట్టుంది. సంవత్సరాల కొలది సోమరి తనంతో పనీపాటూ లేకుండా ఊరికే కూర్చొని వేలకొలది రూపాయలు జీతం తీసుకుంటుంది. తన ముఖ కవలికల్ని బట్టి ఏ పని చేయకుండా ఎప్పటిలా జీతాన్ని పొందాలని ఆలోచిస్తున్నట్టుంది. ఆరోజు సాయంత్రం గార్డెనర్ ను పిలచి " ఈ స్కూలులో నీకు పనిచేయాలని ఉందా లేదా ? నీవు స్కూలులో ఉండాలనిపిస్తే నీ పని నీవు చేసుకుపో ! అలా కాని పక్షంలో మరో స్కూలుకు ట్రాన్ఫర్ పెట్టుకో ! జిల్లా పరిషత్ సి.ఇ.ఓ (ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) గారితో నీ విషయం మాట్లాడతాను. నీవు ఏ పనీ చేయకుండా వేల కొలది జీతం ఎలా తీసుకుంటావ్ ? గార్డెనర్ పోస్ట్ మాకు అవసరంలేదు. పోస్ట్ మరో ప్రాంతానికి ట్రాన్ఫర్ చేయించడం జరుగుతుంది. ఈ రాత్రికి బాగా ఆలోచించి చెప్పు. " అని చెప్పాను. మెమో ఇచ్చి దాని కాపీని సి.ఇ.ఓ కు పంపించా లని నిర్ణయించు కున్నాను. పనిచేయకుండా ప్రభుత్వ సొమ్మును తినడం దేశద్రోహులు చేసేపని. పనిచేయకుండా కాలక్షేపం చేసి జీతం తీసుకోవాలనుకున్నవారి భరతం పట్టాలి. మెమో తయారు చేసి స్టాఫ్ మెంబర్స్ ముందే ఆ మరుచటిదినం ఇవ్వాలనుకున్నాను. మధ్యాహ్నం 12.30 అయ్యేసరికి లాంగ్ బెల్ కొట్టేసి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్లి పోయారు. మధ్యాహ్నం పూట జూనియర్ కాలేజీ మా స్కూలులోనే రన్ అవుతోంది.మరుచటి దినం నేను స్కూలుకు వెళ్ళేసరికి గార్డెనర్, నైట్-వాచర్ మొక్కలన్నీ నాటేసి, ఆ మొదళ్ళు చుట్టూ గెత్తం వేసి నీరు దట్టంగాపోసారు.చాలా సంతోషించాను.ఉదయం స్టాఫ్ ప్రెయర్ నుండి వచ్చిన తరువాత ఈ అకడమిక్ ఈయర్ లో ఏమేం పనులు చేయాలో రఫ్ గా ఒకప్లాన్ వేసాము. టైం కు స్టాఫ్ మెంబర్లు పాఠశాలకు రావడం, అలానే విద్యార్థులు కూడా పాఠశాలకు టైం మీద వచ్చేటట్టు చూడటం, అలానే 7.45 గంటలకు ముందు స్టాఫ్ అంతా స్కూలుకు రావాలి. ప్రెయర్ కు స్టాఫ్ అంతా తప్పనిసరిగా హాజరుకావాలి. ఎనిమిది గంటలకు టీచింగ్ బెల్. ఎనిమిదికి ఒక్క నిముషందాటి లేటైనా సి.ల్ లెటర్ ఇచ్చేయాలి. అసలు నిజానికి ప్రెయర్ కు రాకపోతేనే సి.ఎల్ లెటర్ ఇచ్చివేయాలి. కానీ మీరంతా కష్టపడి పనిచేసి స్పెషల్ క్లాసులు పెట్టి టెన్త్ క్లాస్, సెవెన్త్ క్లాస్ రిజల్ట్ బాగా తెస్తారనే నమ్మకం నాకుంది. అలా ప్రెయర్ కు లేట్ రావడం నెలకు రెండుసార్లు మాత్రమేఅనుమతించబడుతుంది. 8 గంటలు దాటి అంటే టీచింగ్ బెల్ కొట్టిన తరువాత ఒక్క నిముషం ఆలస్యమైనా సి.ఎల్ లెటర్ ఇచ్చేసి క్లాసుకు వెళ్లిపోవాలి. సి.ఎల్ పెట్టేసారు కదా అని ఇంటికి వెళ్ళడానికి వీలులేదు. క్లాసులకుతప్పనిసరిగా వెళ్ళాలి. సి. ఎల్ లెటర్ స్టాఫ్ మెంబర్ ఇచ్చేవరకూ నేను నిరీక్షించవలసిన అవసరం లేదు. ఈయర్ ప్లాన్, మంథ్లీ ప్లాన్లె సన్ ప్లాన్ నెలలో గల మొదటివారంలోనే సబ్మిట్ చేయాలి. పేపర్ వేల్యుయేషన్ మనం అనుకున్న టైంలోనే వేల్యూచేసి ఇవ్వాలనే నిబంధన పెట్టాను. మీకు ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే చెప్పండి. వీలైనంత వరకూ పరిష్కరించడా నికి ప్రయత్నిస్తాను.స్టాఫ్ మీటింగ్ లోఅన్నింటికీ తలలూపేసి హెడ్మాష్టరుగారు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని వెనుకనంటే బాగుండదని చెప్పాను. జూన్ నెల నుండి 10వ తరగతికి, ఏడవతరగతికీ మనం స్పెషల్ క్లాసులు నిర్వ హించి మంచి ఫలితాలు తెచ్చేందుకు కృషి చేద్దామంటూతెలియజేసాను. స్టాఫ్ మీటింగ్ లో డిస్కస్ చేసుకున్నవన్నీస్టాఫ్ ఆర్డర్ లో వ్రాసి స్టాఫ్ కు సర్క్యులేట్ చేసాను. ఆ పద్ధతిలోనే పాఠశాలను నడిపించేటందుకు నిర్ణయించాను. ( సశేషం.) శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్: 7013660252.


కామెంట్‌లు