పూజ్యనీయుడు...అంబేడ్కరుడు--సుజాత. పి.వి.ఎల్--కొన్ని నక్షత్రాలు మినుకు మినుకు మనవు అఖండ దీపాలుగా దేదీప్యమానంగా వెలుగుతాయి అలాంటి నక్షత్రమే 14 ఏప్రిల్ 1891 న జనించి, మెరిసింది అధమజాతివాళ్లు సమాజంలో నిర్లక్ష్యానికి గురవుతూంటే చూసి తట్టుకోలేక వాళ్ల వైపు నుంచుని పోరాడిన మహా మనీషి అంటరానితనాన్ని రూపుమాపడానికి ఆరోజుల్లో ఆయన పెద్ద యుద్ధమే చేశాడు బౌద్ధమతాన్ని ఆలంబనగా చేసుకున్న ఉన్నతాత్ముడు స్వాతంత్ర్య భారతదేశ తొలి న్యాయ శాఖ మంత్రిగా పదవికి వన్నెతెచ్చాడు రాజ్యాంగ నిర్మాణంలో, దార్శనికతో తనదైన ముద్ర వేసి ఇప్పటికీ అనుసరించాల్సిన గ్రంధరాజంగా తీర్చిదిద్దాడు సమస్త మానవాళీ ఎటువంటి వర్గ, వర్ణ వైషమ్యాలు లేకుండా కలిసి మెలిసి పొరులుగా మనగలుగుతున్నారంటే అంబెద్కరుడే కారణం ఎంత వెలుగునిచ్చినా నక్షత్రాలు తమ పని అయిపోయాక రాలిపోతాయికాని బాబాసాహెబ్ 06 డిసెంబరు 1956 లో అందరి హృదయాల్లో ఒదిగిపోయాడుపూజనీయుడయ్యాడుఅక్కడక్కడా విశ్వవిద్యాలయాలకు, సంస్థలకు పెట్టిన పేర్లలోను, నాలుగు రోడ్ల కూడళ్లలోనూ కనిపిస్తే..మనకు వెలుగు బాట ప్రసాదించినందుకు ఒక్కసారి కళ్లుమూసుకుని ప్రార్థిద్దాం మానవులు కృతజ్ఞతామూర్తులని నిరూపిద్దాం.


కామెంట్‌లు