మహా భారతాన్ని తెనిగించిన వారిలో మూడవ కవి ఎర్రన. మొదటి కవి నన్నయ, రెండవ కవి తిక్కన, తదుపరి ఎర్రన. ఈయననే ఎర్రాప్రగ్గడ అని కూడా అంటారు.ఈ కవి 14వ శతాబ్దం (పూర్వ భాగము) చెందిన వాడని తెలుస్తుంది. తిక్కన మహాకవి తరువాత 50 సంవత్సరములు పిదప ఈయన జన్మించి నట్లు తెలుస్తుంది. నెల్లూరు మండలం నందలి కందుకూరు తాలూకా లోని గుడ్లూరు గ్రామంలో జన్మించినట్లు ; చెబుతారు. అతని తండ్రి పేరు సూరన, తల్లి పేరు పోతమ్మ, వీరి ఇంటిపేరు చదలవాడ. అద్దంకిని రాజధానిగా చేసుకొని కొండవీటిని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి ఈతడు. నన్నయభట్టు విడిచిన ఆరణ్యపర్వశేషము తెనిగింపబడక భారతము కొరత పడి యుండుట చూచి ఇతడు తెనిగింపనెంచెను. తన పేరిట తెనిగించినచో నన్నయభట్టు వలె తనకు ఏదైనా కీడు మూడునని భయపడి నన్నయభట్టు పేరుతోనే రచించెను. తాను రాసిన ఈ భాగమును రాజరాజనరేంద్రునికే అంకితమిచ్చెను. భారతంలోని ఇతడు రచించిన భాగములోని మొదటి పద్యము:- స్పురదరుణంశురాగరుచి బొంపిరివోయి నిరస్తనీరదా/ వరణములై దళత్కమలవైభవ జ్రుం భణ ముల్లసిల్ల ను/ద్ధురతరహంససార సమధువ్రతనిస్వనముల్చెలంగగా/ గరము వెలింగె వాసరముఖంబులు శారదేవేళ జూడగన్ /ఈ పద్యం బట్టి ఈ కవి రచించిన ఆరణ్యపర్వము సగం కంటే ఎక్కువగా నుండుని అవగతమవుతుంది.ఈయన రచించిన భారతములో సంస్కృత పదములు మరియు తెలుగుపదములు ఇంచుమించు సమానంగా ఉంటాయి.ఈయన రాసిన అరణ్యపర్వ శేషమునులో ఘోషయాత్ర, రామౌపా-ఖ్యానము సావిత్రి ఉపాఖ్యానము యక్ష ప్రశ్నలు అను నీభాగములు మిక్కిలి పేరుగాంచినవి.రామాయ ణము కూడా రచించి తన ప్రభువైన ప్రోలయవేమారెడ్డి కి అంకితమిచ్చెనందురు,కానీ అది ప్రస్తుతము లభ్యం కాలేదు.ఈయన కవిత్వము మృదువు మధురమునై కదళిపాకమై చాలా వరకు సోమయాజుల కవిత్వమును పోలి యుండును.హరివంశమున ఈతని శైలి పరిపక్వతనొందినది. ఇందు శ్రీకృష్ణుని చరిత్రను ఎంతో సంపూర్ణముగా వర్ణింపబడినది.గోకులం వర్ణించు పట్ల ఎర్రన జానపద జీవితము ఎంతో రమ్యంగా వర్ణించడం జరిగింది. హార్థమైన అనురాగమునకాలంబమైన సాత్విక శృంగార మును వర్ణించుటలో ఎర్రన మేటి. ఉష అనిరుద్ధుల చరిత్రము రుక్మిణీ కళ్యాణము ఇందు మిక్కిలి రసవంతములుగా ఉండును. అనువాద విషయమున ఎర్రన, నన్నయ తిక్కనల మార్గమునే అనుసరించెను. ఎర్రన రచించిన స్వతంత్ర కావ్యములక్ష్మి నృసింహ పురాణము, బ్రహ్మాండ పురాణము నుండి వస్తువును గ్రహించి యెడ నెడ ఉన్న చక్కని వర్ణములు చేర్చి దానిని అతడొక హృద్యమైన ప్రబంధముగా సంతరించిచెను. ప్రహ్లాద చరితము ఇందలి ఒక కథ. భక్తి వర్ణమునా ఈతడు పోతనకు ఈడు కాకపోయిను, ప్రహ్లాద చరిత్ర వర్ణించు పట్ల ఒజ్జబంతి అయ్యెననుట ఇతని శైలిలో అతిశయోక్తి ఉండదు. ఈతని శైలి సత్వ శుద్ధికి నెలవై సత్వ ప్రధానమైన ఇతని శీలమునకాదర్శమువోలెగోచరించును. శ్రీనాథుడు ఇతని సూక్తి వైచిత్రినిప్రశంసించెను. ఇతనికి ప్రబంధ పరమేశ్వరుడు అనియు ఈశ్వర భక్తుడు అగుటచే శంభుదాసుడు అని బిరుదు కలదు. ఎర్రన మహాకవి అరణ్య పర్వ శేషమును పద్య రూపమున పూరించి శాశ్వత కీర్తి నొందెననుట అతిశయోక్తి కాదు. - బాల సాహిత్యము 12వ భాగం--- ఇంకా ఉంది) -బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబర్ - 9290061336


కామెంట్‌లు