ఈ బతుకులు మారేదెపుడు...ఇంకా ఎన్నాళ్ళీ దృశ్యాలు...---ఈ క్రింది చిత్రం చూస్తుంటే వీళ్ళు కాలినడకన గమ్యాన్ని చేరేందుకు పడుతున్న ఆవస్థలకు బాధ పడాలా....ఇంత పేదరికంలో ఉంటూ కూడా నలుగురు సంతానాన్ని పొందినందుకు బాధపడాలో తెలియడం లేదు.... ఇలాంటి దృశ్యాలు చూస్తుంటేఇంకా కుటుంబ నియంత్రణ ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంలో మన ప్రభుత్వాలు అన్నీ ఎంతగా విఫలమయ్యాయో మాత్రం బాగా అర్థమవుతోంది.కొన్ని చోట్ల ప్రభుత్వ సంస్థలు తమ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తున్నా కూడా ప్రజల సహకరించడం లేదు అని తెలిసింది.....కారణం ముమ్మాటికీ "అవిద్య" మాత్రమే...చదువు లేనందు వల్ల ఆపరేషన్ చేసుకుంటే ఏదో జరిగి పోతుందనే భయం.....ఒక్కసారి మూఢ నమ్మకాలు కూడా వీళ్ళ జీవితాలనిలా బలి తీసుకుంటున్నాయి...చదువు జ్ఞానాన్ని పెంచడమే కాకుండా మనిషికి దిక్సూచి వంటిది. ప్రభుత్వం ఇకనైనా "నిర్బంధ విద్య" విషయంలో కఠినంగా ఉండాలని మనవి...వలస కార్మికుల కాలి నడక చిత్రాలలో చాలా చోట్ల....ముగ్గురు లేక నలుగురు సంతానంతో కనిపిస్తున్నారు...ఈ కరోనా వల్ల దేశంలోని (బహుశా ప్రపంచంలోని) వలస కార్మికుల జీవన విధానం ప్రభుత్వం ముందు ఓ పెద్ద సవాల్ లా కనిపిస్తోందిప్పుడు..... వాళ్ళ జీవితాలను ఇప్పుడు చక్కదిద్ద వలసిన బాధ్యతను గ్రామ సర్పంచ్ నుండి దశల వారీగా ప్రధాన మంత్రి వరకు స్వీకరించాలి...కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ అనేకానేక దృశ్యాలు సామాన్య మానవుల మైన మనల్నే ఇంతగా కలవర పెడుతుంటే....ప్రజా నాయకులను మరెంతగా కలవరపెట్టాలి...ఇప్పటికిప్పుడు ప్రకటిస్తున్న ఉచిత పథకాలు బాగానే ఉన్నాయి...గమ్యం చేరిన వాళ్ళకు ఓకే....మార్గ మధ్యలో ఉన్న వలస బతుకుల సంగతేంటి....ముందు ఎక్కడి వాళ్ళను అక్కడి నుండే వాళ్ళ స్వస్థలాలకు తరలించి మానవత్వాన్ని చాటుకోండి ...హృదయాలను కదిలించే దృశ్యాలను ఇంకా ఎన్నాళ్ళు చూడాలి......-శాంతి కృష్ణ 17.05.20


కామెంట్‌లు