కరోనా పద్యాలు 171) చిర్రగోనె చిత్తి చిత్తు బొత్తాటాడి అష్టచమ్మలోన అందరైరి దాచుకున్న తీరు దాగుడు మూతలు పల్లె తల్లి ఒడిన పరవశంబు 172) సందడంత కలుగు చార్ పత్త ముంగిలి రాళ్ళతోని పోటి రయముగాను తాడు బొంగరాల తాండవ క్రీడలు పల్లె తల్లి ఒడిన పరవశంబు 173) కూతపెట్టు నాట బాతల పోరుతో రాత్రి పగలు కూడ రంజుగుండు బంతి బాదుతున్న పరుగుల వరుదలు పల్లె తల్లి ఒడిన పరవశంబు 174) పట్నమొదిలి వచ్చి పల్లెలో జేరిన బాల కృష్ణులాట బాగు బాగు వ్యాధి పేరుతోని పల్లె పరిమళము పొందుతుండ్రి జనులు పూట పూట 175) బావులందు చేరి బాల్యాన ఈతలు గుర్తుకొచ్చె నేడు కూడలందు సిరుల కల్పవల్లి సిద్దిపురి ఒడిన కాలువందు ఈత కనులవిందు 176) వాగు వంక దాటి ప్రజల భుక్తి కొరకు ఆదివాసికింత అన్నమెట్ట తాండలందు తిరుగు తల్లిరా సీతక్క అడవినందు నడుచు ఆడబిడ్డ 177) వైను షాపు వద్ద వరుసగా నిల్చిరి దండిగాను వుంది దండయాత్ర అడ్డు అదుపులేక యసలు కరోనాను మరిచినట్లు వుండ్రి మందుప్రియులు 178) ధరలు పెంచినారు దండిగా దోచుతూ న్యాయమెక్కడుంది నగరమందు అడ్డగోలు ధరలు అదుపు లేకుండను లాకు డౌనులోన లాభమేట్ల 179) ధరలు మాట మరిచి దాచిన సోమ్మంత మందులన్ని కొంటు విందులనిరి దుగుడులోన దాచి దూపదూపంటూను తాపతాపకింత తాగుతుండ్రి 180) పరుగులెట్టినాది పదిలక్షలందున ఆగ్రరాజ్యమంత నాగమైంది అన్ని హంగులున్న అమెరికా వణికేను భరతపుత్రులార బయటవలదు ఉండ్రాళ్ళ రాజేశం


కామెంట్‌లు