విశ్వకవి.. రవీంద్రనాథ్ ఠాగూర్: లిఖిత కుమార్ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 1861 మే 7న కలకత్తా లో జన్మించారు. తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్‌. తల్లి శారదాదేవి. భార్య మృణాళినీ దేవి. సంతానం ఇద్దరు మగ పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు. ఠాగూర్ రాసిన గీతాంజలి కావ్యానికి 1913 లో నోబెల్ బహుమతి లభించింది.కలకత్తా లోని శాంతినికేతన్ లో గల ప్రతిష్టాత్మక విద్యాలయం విశ్వభారతి ఠాగూర్ స్థాపించినదే. తూర్పు బెంగాల్ లోని పద్మ నది ఒడ్డున షెలీదా, షాజహాన్ పూర్ లలో ఠాగూర్ గడిపిన జీవితమే జీవితం.1890 నుంచి 1898 వరకు ఆయన అక్కడ ఉన్నారు. ఆ సమయంలోనే ఐరోపా లో పర్యటించారు.ఒక విధంగా అది టాగూర్ ఏకాంతవాస, రచనా వ్యాసంగ జీవితం అధ్యాయం. అక్కడి నుంచి భార్య మృణాళినీ కి మేనకోడలు ఇందిరకి తరచూ ఉత్తరాలు రాస్తుండేవారు.నది ఒడ్డున పడవలో నివాసం ఉంటూ సామాన్యుల జీవితాలను చాలా దగ్గరగా పరిశీలించారు ఆయన.ఠాగూర్ ఎక్కడ స్థిరంగా ఉండక పోవడంతో తండ్రి ఆయనను మొదట ఇంగ్లాండ్ చదువులకు పంపారు.అక్కడి నుంచి కూడా అర్ధంతరంగా వచ్చి చేస్తుండడంతో షెలీదా లోని కుటుంబ ఆస్తులను చూసుకోమని పంపించారు. అదే ఠాగూర్ జీవితాన్ని మలుపు తిప్పింది.ఠాగూర్ తొలినాళ్ళ అత్యుత్తమ రచనలన్నీ అక్కడ పుట్టినవే. ఉదయాన్ని ఉదయం అనవద్దంటారు ఠాగూర్. రేపటికి ఈ ఉదయం.. నిన్నటి ఉదయం అవుతుందని ఆయన భయం! అనుభూతులకు భూత వర్తమాన భవిష్యత్ కాలాలు లేవంటారు ఆయన. ఠాగూర్ కి ఈ దృష్టిని ఇచ్చింది పద్మావతి నది.ఠాగూర్ 80 ఏళ్ల జీవితంలో నది ఒడ్డున గడిపిన పదేళ్ళకాలంలో ప్రధానంగా ఆయనలోని విశ్వ కవిత్వానికి ప్రేరణ. జీవితమంతా ప్రకృతి ఏకాంత సంభాషణకు ఆరాటపడిన ఠాగూర్ 1941 ఆగస్టు 7 న మరణించారు.


కామెంట్‌లు