నవయుగ వైతాళికుడు కందుకూరి--ఆధునిక సమాజంలో మనుషుల ఆలోచనలో, అభిరుచులలో, ఆచరణలో రావలసిన మార్పులను గుర్తించి చైతన్యంతో వివిధ ఇతివృత్తాలను సమకూర్చుకొని భిన్న ప్రక్రియలలో రచనలు చేసి, సమాజానికి సాహిత్యానికి ఉన్న సంబంధాన్ని గుర్తెరిగి సామాజిక సంస్కరణకు సాహిత్యాన్ని సాధనంగా చేసుకొని ఆధునిక సాహిత్య యుగకర్తగా, గద్య తిక్కనగా, సంఘ సంస్కర్తగా, కవిగా, పరిశోధకుడిగా, పత్రికా నిర్వాహకుడిగా, నవల రచయితగా, బహుగ్రంథ కర్తగా, దక్షిణ భారత దేశ విద్యాసాగరుడిగా పేరు పొందిన నవయుగ వైతాళికుడు కందుకూరి. వీరేశలింగం వితంతు పునర్వివాహం శాస్త్ర సమ్మతమని వాదించి 1881లో మొదటి వితంతు వివాహం జరిపించారు. వితంతువుల కొరకు తన స్వగృహంలో ప్రత్యేక శరణాలయాన్ని స్థాపించి వాళ్ళకు పునరావాసాన్ని కల్పించారు. తనకున్న ఆస్థితో స్త్రీల అభ్యున్నతికి దోహదం చేసే విధంగా హితకారిణి సమాజం అనే గొప్ప సంస్థను, బాలికల పాఠశాలను స్థాపించారు. ఆనాడు ప్రజల్ని పీడిస్తున్న లంచగొండితనం, అన్యాయాలు, అక్రమాలు, మూఢ నమ్మకాలను తన ప్రహసనాల ద్వారా, వివేకావర్ధిని, సతీహిత బోధిని అనే పత్రికల ద్వారా ఎండగట్టారు. కందుకూరి భాస్కర్


కామెంట్‌లు