మల్లాడి సత్యలింగం నాయకర్ నాడు రంగూన్ వెళ్లాలంటే స్టీమర్ లు లేవు!తెరచాప ఓడల చాటున చేటు ప్రయాణాలే... ఆ రోజుల్లో చిన్నా చితకా పనులు చేస్తూ పెద్ద పనులకు ఎదిగీ ఇల్లు ఆస్తులు వస్తు వాహనాలతో పాటు లాంచీలు సంపాదించి, ఆస్తులు సంపాదించిన ధనవంతులు ఉన్నారు, కానీ... ధర్మాత్ముడు ఒక్కరే అతడే మల్లాడి సత్యలింగం నాయకర్ తెలుగుజాతి కీర్తిని నిలిపిన మహనీయుడు పది రూపాయలు ఆర్జన అతిపెద్ద నెల జీతం ఆ రోజుల్లో నాటి రూపాయి నాణెం, నేడు పది బంగారు కాసులతో సమానం... ఎట్టి పరిస్థితులలో ఇరువది లక్షల రూపాయల ఆస్తులు సంపాదించి, వితరణ చేసిన ఇలలో కర్ణుడు! ఆయన పరమపదించిన నాటికే అపర కుబేరుడు... మల్లాడి సత్యలింగ నాయకర్! ఈతని వితరణ గుణం మరువలేనిది! విద్యలేని ఆతడు ఇతరులకు ప్రాథమిక విద్య నేర్పించే, చేతి పనులు నేర్పించి బ్రతుకుతెరువు ను చూపే చెన్నపురి రాజధాని హిందువులలో ఒకరికి ఏటా విదేశాలకు పంపే యూరప్ అమెరికా జపాన్ వంటి దేశాల పంపి చదువులు చదివించే ఏడు లక్షల రూపాయల పైకం డిపాజిట్ చేసే వచ్చే వడ్డీతో దానధర్మాలు చేసి ప్రజల మన్ననలు పొందే... ఈతని దత్తపుత్రుడు సుబ్రహ్మణ్యం కాకినాడ నివాసి... వీరి వితరణతో అమెరికా వెళ్ళిన బాపినీడు... అమెరికా వెళ్లి 1923లో ఎమ్మెస్సీ చదివే... ఆ రోజుల్లో అదే గొప్ప చదువు... భారత్ తిరిగి వచ్చిన ఆయన గాంధీ బాటను సాగిన త్యాగశీలి! ఈయన అనేక గొప్ప తెలుగులో అనేక రచనలు చేసే,గొప్పవైన గ్రంథములు ప్రచురించి ప్రజలకు అందించే అందులో ఆంధ్ర సర్వస్వము పేర్కొనదగ్గది గుణములన్ఇంట వితరణ గుణం గొప్పది కదా!! అందుకే మన మల్లాడి సత్యలింగం నాయకర్ శాశ్వత కీర్తిని పొందే!!! సేకరణ: బెహరా ఉమామహేశ్వరరావు పార్వతీపురం-535501 సెల్ :9290061336 అడ్రస్: బెహరా ఉమామహేశ్వరరావు రచయిత కొత్త వీధి నరసింగపుర అగ్రహారం పార్వతీపురం -535501 విజయనగరం జిల్లా ,ఆంధ్ర ప్రదేశ్.


కామెంట్‌లు