లయోలలో ...: మద్రాసు మహానగరంలోని కాలేజీలలో ఒకటైన లయోలా భారతదేశంలోని విద్యాసంస్థలలో ఉన్నత ఐదు స్థానాలలో ఒకటిగా ఉండటం విశేషం. మద్రాసు విశ్వ ద్యాలయం పరిధిలోని ఓ స్వయం ప్రతిపత్తిగల కాలేజీ లయోలా. తొంభై తొమ్మిది ఎకరాలలో మద్రాసు నడిబొడ్డయిన నుంగంబాక్కమ్‌ రైల్వే స్టేషన్ కి సమీపంలో లయోలా కాలేజీ క్యాంపస్ ఉంది. 1930 నాటి గోతిక్ చర్చి, ప్రతి క్రీడ కోసం ప్రత్యేకమైన ఆవరణలు ఉండటం ఈ కాలేజీ విశేషం. ఈ కాలేజీ ముగ్గురు వ్యవస్థాపకులలో ఫాదర్ బెర్ ట్రామ్ ఒకరు. మొత్తం డెబ్బయ్ అయిదు మంది విద్యార్థులతో 1925 జూలై ఏడో తేదీన ప్రారంభమైంది. మొదట్లో గణితం, చరిత్ర, ఆర్థిక శాస్త్రంలో మాత్రమే క్లాసులు ఉండేవి. అయితే ఇప్పుడు వేల మంది విద్యార్థులతో నడుస్తున్న ఈ కాలేజీతో నాకెలాంటి అనుబంధమూ లేదు కానీ మా పెద్దన్నయ్య శ్యామలరావు 1962 లో ఈ కాలేజీ నుంచే బిఎస్సీ డిగ్రీ పొందాడు. పైగా వాడికి తెలుగు లెక్చరర్ మరెవరో కాదు, వాడి మావగారైన చల్లా సత్యనారాయణ గారే. ఆయన ముప్పై ఏళ్ళపైనే ఇక్కడి తెలుగు శాఖలో పని చేశారు. ఇదే కాలేజీలో ఈ ఏడాది మొదట్లో హిందీ లెక్చరర్ గా మా మూడో అన్నయ్య ఆంజనేయులు కూతురు ఉమ చేరింది. ఉమ హిందీలో డాక్టరేట్ చేసింది. తను రెండు సెక్షన్లకు హిందీ పాఠాలు చెబుతోంది. ఈ కాలేజీలో నా స్కూల్ మేట్స్ ముగ్గురు చదివారు. వారు, చల్లా బాలసుబ్రహ్మణ్యం, వి. వెంకటేశ్వర రావు, హరి నాగభూషణ శాస్త్రి. ఏడాది క్రితం మరణించిన వెంకటేశ్వరరావు ఆడిటర్ గా ఉండేవాడు. బాలసుబ్రహ్మణ్యం, నాగభూషణ శాస్త్రి బ్యాంకింగ్ రంగంలో పని చేశారు.ఈ కాలేజీలో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగిన వారిలో రామస్వామి వెంకట్రామన్ (భారత మాజీ రాష్ట్రపతి), జాస్తి చలమేశ్వర్ (సుప్రీం కోర్టు న్యాయమూర్తి, ఈయన తండ్రి గారు మచిలీపట్నంలో ప్రఖ్యాత న్యాయవాది. బందరు హిందు పాఠశాలలో చదివిన తర్వాత మద్రాసు లయోలా కాలేజీలో ఫిజిక్స్ డిగ్రీ పొందిన చలమేశ్వర్ ఆ తర్వాత విశాఖపట్నం ఆంధ్ర విశ్వకళా పరిషత్ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు), పూసపాటి ఆనంద గజపతి రాజు (విజయనగరం, పూసపాటి రాజవంశీయుడు, మాజీ మంత్రి), పి. చిదంబరం (కేంద్ర మాజీ హోం శాఖ మంత్రి), దయానిధి మారన్ (డిిఎంకే నాాాకుుడు, మాజీ కేంద్ర మంత్రి), పర్వతనేని బ్రహ్మయ్య (ఛార్టర్డ్ అకౌంటెంట్), మహేంద్రసింగ్ ధోని (భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్), రామనాథన్ కృష్ణన్, రమేష్ కృష్ణన్ (తండ్రీ కొడుకులు (టెన్నిస్ క్రీడాకారులు), ఘట్టమనేని మహేష్ బాబు, దగ్గుబాటి వెంకటేష్, ప్రశాంత్, అరవిందస్వామి (సినీ నటులు), యువన్ శంకర్ రాజా (సంగీత దర్శకుడు), విశ్వనాథన్ ఆనంద్ (చదరంగ క్రీడాకారుడు), అమృత్ రాజ్ సోదరత్రయం ఆవంద్, విజయ్‌, అశోక్ (టెన్నిస్ క్రీడాకారులు), సుబ్బరామయ్య మీనాక్షిసుందరం (భారతీయ గణిత శాస్త్రవేత్త) తదితరులున్నారు. - యామిజాల జగదీశ్


కామెంట్‌లు