మానేరు ముచ్చట్లు--నిన్న కొంచెం తక్కువగా రాయటం జరి గింది. మిత్రుల వద్ద నుంచి సమాచారం రావాల్సింది ఉండే.అందుకే ఎక్కువ రాయ లేక పోయాను.నిన్న నాతో కలిసి చదువుకున్న మిత్రుల గురించి రాసాను.పెద్దవారిలో నాకు నాచిన్నతనంలో తెలిసిన వాళ్లలో ఇబ్రహీం సారు లీలగాగుర్తున్నారు.ఆయన రూపం కన్నుల్లో మాటలు చెవుల్లో భద్రంగా ఉన్నాయి.మనిషి కాస్త పొట్టిగా చామన చాయ వర్ణం ఛుడీదార్ పైజమా మీద లాల్చీ,ముందుకు వంక తిరిగిన పలుచని బూట్లు,కుళ్లా టోపీ,సురుమా పెట్టిన కళ్లు,గుండ్రని ముఖానికి చిన్న గడ్డం -ఇదీ ఆయన రూపం.బహుశః నేను నాలుగో తరగతి అంగట్ల బళ్లో చదివినపుడను కుంటా,ఆయన చెప్పిన వేమన పద్యమొకటీ,సుమతీ పద్యమొకటిసన్నని గొంతుతో, రాగ యుక్తంగా పాడుతూ మాతో చది వించటం యాదికున్నది.ఆయన‘చెప్పులోని రాయి చెవిలోని జోరీగకాలులోని ముల్లు కంటినలుసుఇంటిలోని పోరు ఇంతింత కాదయావిశ్వదాభిరామ వినురవేమఅని చాలా స్వచ్ఛమైన తెలుగులో పద్యం కొంచెం పట్టి పట్టి చదివినట్ల నిపించేది.కాని అది మాతృభాష కాని వారికుండే సహజమైన ఇబ్బంది అంతే. మరో పద్యం నాకు గుర్తున్నది‘చీమలు పెట్టిన పుట్టలుపాములకిరవైన యట్లు పామరుడు తగన్హేమంబు కూడ బెట్టిన, భూమీశుల పాలజేరు భువిలో సుమతీ’అలా ఆయన పిల్లల్ని లాలించి నవ్విస్తూ పాఠాలు చెప్పే ఉపాధ్యా యుడు అంతే కాని బెదిరించి పాఠా లు చెప్పే ఉపాధ్యాయుడు కాదు.నాకు తెలిసిన మరో ముస్లిం సారుబషీరుద్దీన్ సారు.ప్రసన్నవదనంతోచాలా మెల్లిగా మాట్లడేవారు. మిత భాషి.ప్రేమ భావం కళ్లల్లో తొణికిస లాడేది.బషీరుద్దీన్ సార్ గురించి ఒక విశేషమేమిటంటే , ఆయన అప్పట్లో ఒక ప్రసిద్ధి చెందిన భూతవైద్యులు.ఆయుర్వేద చికిత్సకు నాగరాజు తిరు మలయ్య గారి దగ్గరికి వచ్చినట్లే మానసిక చికిత్సకు బషీరుద్దీన్ సాబ్ కడకు బండ్లు కట్టుకుని వచ్చేవారు.ఆయనను చూస్తే కడు సౌమ్యుడు.ఆయనకు భూతపిశాచాలెలాభయపడేవో చిన్నప్పుడు నాకర్థం కాని విషయం.నేను వాళ్ల ఇంటి గేటు దాకా చాలా సార్లే వెళ్లాను.మా బంధువులెవ రైనా చికిత్సకు వస్తే ఇల్లు చూపించడా నికి.వాళ్ల ఇల్లు మీది వాడకుండేది. అయితే ఆయన చికిత్స విధానం గురించి మా చెవుల్లో పడుతుండే విషయం ఏమిటంటే , ఇంట్లో కొంత వరకు వారి పద్ధతిలో మంత్ర,తంత్రాలు చేసివాటితో తగ్గని రోగులను ఖిల్లాలోప లికి తీసుకు వెళ్లి చింతబరికెల చికిత్స చేసేవారని. దెబ్బకు దయ్యం దిగి వచ్చుడంటే ఇదేనేమో.ఆయనంటే ఊరందరికీ ఎనలేని గౌరవం.వారి పెద్దబ్బాయిముజీబొద్దీన్ నాకు ఆరవతరగతి నుంచి పదకొండవ తరగతి దాకా సహాధ్యా యి. డిగ్రీలో కాంటెంపరరీ. అక్కడ విడి పోయామంటే చాలా ఏండ్లకు అనుకోకుండా ఆదిలాబా దులో కలిసాడు. ఇంగ్లీషులో ఎం.ఏ. చేసిన తరువాత స్వంతంగా ఆదిలా బాదు లో కాలేజీ నడిపిస్తున్నాని చెప్పాడు.అలా కలిసుకున్న కొంతకాలానికిపేపర్లో ఆయన కుటుంబమంతా ఆయనతో సహా జీపు యాక్సిడెంటులో మృతి చెందారని చదివినప్పుడు విభ్రాంతికి గురయ్యాను.ఇది జరిగి కూడా చాలా రోజులయ్యింది.బషీరుద్దీన్ సారు మిగతా ఇద్దరు కొడుకులులతీఫొద్దీన్,రషీదుద్దీన్లు తమ్ముళ్లతో కలిసి చదువుకున్నారు.వారిద్దరూప్రభుత్వ లెక్చరర్లుగా పదవీవిరమణపొందారు.లతీఫొద్దీన్ తో మొన్న మాట్లాడి సార్ ఫోటో పంపించమంటేపంపించారు.ఆయనకు కృతజ్ఞతలు.ఇక నాకు ప్రత్యేకంగా బాగా సన్నిహి తమనిమించిన వ్యక్తి ఒకరున్నారు.ఆ యన కరీమొద్దీన్.ఆయనేదే నా వయసువాడనుకునేరు.కాదు బాపు తోటి వాడే.ఆయనకు కిరాణా దుకాణముం డేది.మాకు అక్కడ ఖాతా ఉండేది.ఇంటికి ఏ సామానులు అవసరం పడ్డా తీసుకురావడం నావంతే. ఇంటికి పెద్దవాడిని కనుక నాతో పాటు తమ్ముడిని కూడా తీసుకునివెళ్లి సరుకులు తెచ్చే వాడిని. ఆదే మిటో ఊళ్లో కోమట్ల దుకాణాలు చాలానే ఉన్నా కరీముద్దీన్ దుకాణంలో గిరాకీ బాగా ఉండేది. నేనెప్పుడు వెళ్లినా చాలా సేపు వేచివుండ వలసి వచ్చేది,”కరీమొద్దీన్ సాబ్ ఏమాయె మా సామాను “అనిని నేనడగడం ఆయన ఠహరో మియాఅనడం పరిపాటి.నగదు వారిని పంపిన తరువాత ఖాతా వాళ్లను పలుకరించే వాడు.మనిషి సౌమ్యుడువాళ్లకు గిర్నీ కూడా ఉండేది.వారి పూర్వీకులది నవాబుల ఖాన్దాన్ అని విన్నాను.ఆయన పిల్లలు విదేశాల్లో స్థిర పడ్డట్టు తెలిసింది.ఆయన మంచి తనం ఎక్కడంటే బాపుకు డబ్బులు సర్దుబాటు కానప్పుడు పల్లెత్త మాటనకుండా ఇచ్చినప్పుడుతీసుకునేవాడు.డబ్బులు ఎక్కడికి పోవనే భరోసా.అలాగే నాకు తెలిసిన వ్యక్తి పోలీసుపటేలు సయ్యద్ హుస్సేన్ సాబ్.ఆయనకా పేరు కంటే పోలీసుపటేల నేదే ఎక్కువ వాడుక.కరణాలింటికి పోయినప్పుడో,బజారుకు పోతుండగాశాంతమ్మ హోటలు దగ్గరనో తరచు చూచేవాణ్ని.అగ్గిపెట్టె అయిపోతేనో పిప్పరమెంట్లు కొనుక్కోవడానికో ఆమె హోటల్ కం షాపుకు వెళ్లే వాళ్లం. పేరుకు శాంతమ్మ కానీ కట్టూబొట్టూతురకపద్ధతి ఉండేది.మొదట్లో అర్థమయ్యేది కాదో ఆ ఆలోచనే కలిగేది కాదో కాని ఎప్పటికో అర్థమయింద ఆమె ఆయనకు విలాసపత్ని అని.ఎప్పుడన్నా పని పడితే బాపు వాళ్లింటికి పంపించేవాడు ‘క్యారె బేటా అని ప్యారీ గా పలుకరించేవాడు.ఆ నాటి సామరస్యం వేరు.ఒకటి రెండు సార్లు ఇంట్లో ఊరి పెద్దలందరితో పాటు మా ఇంట్లో విందు భోజనం కూడా చేసినయాది.ఆయన మేనల్లుడ నాతో కలిసిచదువుకున్నాడు కొన్ని రోజులు.అతని పేరు ఇబ్రహీం అని గుర్తు.బాగా ఎత్తరిఇప్పుడెక్కడ ఉన్నాడో. రేపటి ముచ్చట్లలో 1950 ల్లో విద్యాభివృద్ధికై నిరంత రం పాటు పడి విద్యార్థుల గుండెల్లో ఇప్పటికీ నిలచి ఉన్న హాషం సారుగురించి.- రామ్మోహన్ రావు తుమ్మూరి
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
భాషా భూషణం ఏసీపి నాగభూషణం!!?:- డా.ప్రతాప్ కౌటిళ్యా.
• T. VEDANTA SURY
చిత్రం : బృంద -ఎనిమిదవ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళిఘనపూర్-మెదక్ జిల్లా
• T. VEDANTA SURY
మా ఊరి చెరువు ( బాల గేయం ) : డాక్టర్. కందేపి రాణి ప్రసాద్
• T. VEDANTA SURY
అమ్మలా పరిపాలించాలి!!;- డా.ప్రతాప్ కౌటిళ్యా
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి