చిన్న , చిన్న చిట్కాలు -2- బాలింతలకు పాలు సంవృద్ధిగా పడాలంటే పచ్చి మొక్క జొన్నలను మెత్తగా నూరి నువ్వుల నూనె లో పోపు చేసి సూపగా చేసి తాగాలి. పెను కొరుకుడు వ్యాధి తగ్గాలంటే ఉల్లిగడ్డల రసం తీసి అందులో మిరియాల పొడి + ఉప్పు కలిపి తలకు పట్టిస్తే పెను కొరుకుడు తగ్గి తలపై వెంట్రులు మొలుస్తాయి .ఇది తెల్ల మచ్చలు రాకుండా కాపాడు తుంది. తలపై చుండ్రు తగ్గాలంటే నువ్వుల నూనెలో వెల్లుల్లి + మిరియాల పొడి వేసి తైలంగా కాచి తలకు రాచుకోవాలి . కొద్దీ రోజులలో చుండ్రు తగ్గి పోతుంది. అజీర్తి , కడుపుబ్బరం ఎక్కువైనప్పుడు శొంఠి + మిరియాలు + పిప్పళ్లు చూర్ణంతో నీరు ఇంగువ పొడి + ఉప్పు కలిపి తాగితే జీర్ణ క్రియ బాగు పడుతుంది. కడుపుబ్బరం తగ్గిపోతుంది. ఇది కడుపులోనే గ్యాస్ ను నివారిస్తుంది. రక్త ప్రసరణను కర్మబద్ధీకరిస్తుంది. బి. . పి ని తగ్గిస్తుంది. - పి . కమలాకర్ రావు


కామెంట్‌లు