ఉత్పలమాల పొద్దున లేచివెళ్ళి మును ముం దుగనారుకు నీరుబెట్టి తా నెద్దుల గట్టుకన్ హలము నేర్పుగదుక్కిని దున్నుచుం డగన్ సద్దులు దెచ్చియున్ని టకు చక్కగ నన్నము తిన్న యంతనే సుద్దులు చెప్పుకుంట విన సొంపుగ నాట్లను వేయుచుందురో 2. ఉత్పలమాల కర్షకులెంతయో పనిని కాదనకుండగ చేసిచూపగన్ వర్షము వచ్చినంతనిల వాడినచేలుకు ప్రాణమందగన్ హర్షము గల్గునే మదికి నందరి యండనె తోడుగుండగన్ కర్షకు లెల్లరున్ ప్రజల కాంక్షలు దీర్చుచుమెల్గు చుందురున్ వరుకోలు లక్ష్మయ్య గట్లమల్యాల


కామెంట్‌లు