ఈ ఫోటో లో ఉన్నది మా నాయనమ్మ అంగలకుడిటి శేషమ్మ. పాటల నది.ఇరవై నాలుగుగంటలూ పాటలు పాడుతూ నే ఉంటుంది. ఆమెకు శివుడు అంటే చాలా ఇష్టం. దాదాపుగా శివ పార్వతుల పాటలు పాడుతుంది. మడి కట్టుకుని వంట చేస్తూ మధ్యలో పిల్లలు తకారని మళ్ళీ మళ్ళీ స్నానాలు చేస్తుంటుంది. రోజుకు 20 సార్లయినా స్నానం చేస్తుంది. నిద్ర పోయేటప్పుడు తప్ప మిగతా సమయమంతా పా డుతూనే ఉంటుంది.ఆమె పాటలు నోటీచేసుకోలేక పోయానని ఇప్పుడు అనుకుంటుంటాను.ఆమె 1993 లో మరణించారు. ఒక పాటల ప్రవాహం ఆగిపోయింది.- డాక్టర్ . కందేపి రాణి ప్రసాద్


కామెంట్‌లు