నేడు కారల్ మార్క్స్ 202 వ జయంతి.--తన సిద్ధాంత ప్రేరణతో చరిత్ర సృష్టించిన మార్క్స్ జర్మనీలోని ట్రయర్ పట్టణంలో ఈరోజే 1818 లో జన్మించాడు.1841 లో డాక్టరేట్ పొంది జర్మనీ చేతివృత్తులవారీలో ఏర్పడిన 'లీగ్ ఆఫ్ ది జస్ట్' కోరికమేరకు కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో గ్రంథాన్ని మానవచరిత్రలో ఓ జ్నానోదయ విస్ఫోటన రచనగా వెలువరించాడు.1867 లో 'క్యాపిటల్'పుస్తకం తొలిభాగం రాశాడు. 1917 రష్యా విప్లవంతో ఆయన కీర్తి దిగంతాలు ముట్టింది.మార్క్స్ దృష్టిలో ఏ సిద్ధాంతమూ శాశ్వతమైందికాదు. కాలంతో పాటు అన్నీ మారవలసిందే అని చెప్పాడు.వర్గ సంఘర్షణ అనేది తప్పనిసరి అనీ, అయితే అది హింసాత్మకంగా ఉండాలని మార్క్స్ కోరుకోలేదు. మార్క్స్ సిద్ధాంతానికిప్రత్యక్షం గానో,పరోక్షంగానో ప్రభావితం కాని దేశమంటూ లేదు.మార్క్స్ న్యూయార్క్ ట్రిబ్యూన్ కు ఐరాస విలేఖరిగా పనిచేశాడు. భారతదేశంపై బ్రిటిష్ పాలనా ఫలితాల గురించి విశిష్ట వ్యాసాలు రాశాడు. మార్చి 14 1883 లో అస్తమించిన మార్క్స్ ప్రభావదీప్తికి అస్తమయంలేదు.- సుధామ


కామెంట్‌లు