సీతానగరం హైస్కూలు చాలా పెద్దది. టెక్కలి హైస్కూల్, పాలకొండ జూనియర్ కాలేజీ, బలిజిపేట స్కూల్ బిల్డింగ్స్, విశాలమైన ప్రాంగణం, ప్రశాంత వాతావరణం కలిగి ఉంటుంది. ఒక్క సమస్య ఏమంటే హై స్కూల్ ప్రక్కనుండే బస్సు రోడ్డు, ఆ ప్రక్కనుండి కొద్ది దూరంలో రైల్వే లైన్ ఉంది. క్లాసులు జరుగుతున్నప్పుడు బస్సులు, రైళ్లు బళ్ళు రాక పోకలవలన శబ్దాల వలన కొంత డిస్ట్రబెన్స్ జరుగు తుంది. అదొక్కటే మినహా స్కూలుకు ఏ విధమైన సమస్య లేదు. నేను ఏప్రిల్ 23న సీతానగరం పాఠశాలలో చేరాను. మండువేసవి. వేసవి శలవులు ఇచ్చేసారు. పదవతరగతి పరీక్షల పని ఉంటుంది. హెడ్మాష్టరు, నాన్ టీచింగ్ స్టాఫ్ తప్పనిసరిగా రావాలి. ఆ స్కూలులో నాన్- టీచింగ్ స్టాఫ్అటెండరు, గార్డెనర్, స్కావెంజర్ ఆడవాళ్లు ఉండేవారు. నైట్ వాచర్ ఒక మగవాడు ఉండేవాడు. అతని పేరు అప్పారావు.ఆడవాళ్లకు ఏవిధమైన పని గత హెడ్మాష్టర్లు చెప్పినట్టు నాకు అనిపించలేదు. అటెండరుకు ఏ ఫైలు ఎక్కడుందో తెలియదు. తను జీతం మాత్రం పన్నెండు వేలు పైబడే తీసుకుంటుంది. ఇక గార్డెనర్ కు పని అసలు లేనట్లే ఉంది. ఎంచేతనంటే అంత విశాల మైన మైదానంలో ఒక్క పూలమొక్క గానీ, ఇతర మొక్కలు గానీ లేవు. మైదానం అంతా బంజరు భూమిలా ఉంది. ఏమైతేనేం ఆమె జీతం మాత్రం పదివేల పైబడే ఉంది.ఇక నైట్ వాచర్ జీతం 10 వేలు పైబడే ఉంది. నైట్ వాచర్ ఒక్కడే నైట్- వాచర్ పని, ఆఫీసు అటెండరు పని చేసేవాడు. స్కావెంజర్ గదులు, పాఠశాల ఆవరణ పరిశుభ్రం చేయడం చేస్తున్నాడా లేదా అనిపించింది. ఎక్కడ చూసినా చెత్తా చెదారాలే ! ఇక టీచింగ్, నాన్- టీచింగ్ పరిస్థితులేమిటో గమనించాలి. ఏదిఏమైనా స్వేచ్ఛా జీవనానికి అలవాటు పడినవారిని కొన్ని నిబంధనలతో జీవనం గడపమంటే కష్ట సాధ్యమవుతుంది. నాపద్దతికి వీళ్లంతా రావాలంటే కనీసం రెండు, మూడు నెలలు పడుతుంది. వేసవి సెలవులుఇచ్చినప్పటికీ ఆఫీసు వర్క్ ప్రత్యేకంగా ఆరునుండి తొమ్మిదవతరగతి వరకూ ప్రమోషన్ లిస్ట్ తయారుచేయడం పై అధికారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం, తరువాత పదవతరగతి ఫలితాలు రావడం, పాస్ సర్టిఫికెట్స్, టీ.సీలు,స్టడీ సర్టిఫికెట్స్ ఇవ్వడం, పదవతరగతి పరీక్ష పోయిన వారికి మళ్లీ పరీక్షలకు హాజరయ్యేటందుకు పరీక్ష ఫీజులు వసూలు చేయడం, తరువాత ఏడవతరగతి ఫలితాలు జిల్లావిద్యాశాఖ వారు రిలీజ్ చెయ్యడం, పరీక్షలు తప్పినవారికి మరల ఫీజులు కట్టించడం- ఇవన్నీ ప్రతీ పాఠశాలలో జరగవలసిన కార్య క్రమాలే ! ఈకార్యక్రమాలను నిర్వహించినందుకుగాను హెడ్మాష్టరుకు, నాన్- టీచింగ్ స్టాఫ్ లో ఒక సభ్యునికి ఎరన్డులీవ్ ను మంజూరు చేస్తారు. అటెండరు ఉన్నా లేనట్లే లెక్క. ఏ రికార్డు ఎక్కడ ఉందో తెలియదు. ఆమె డిసీజ్డ్ కోటాలో ఉద్యోగం పొందిందని తెలిసింది . ఆమె ఊరు ' చోళ్ళపదం'.మా ప్రక్క గ్రామం. నేను బాల్యంలో చోళ్ళపదం కు 5 కిలోమీటర్ల దూరంలోనున్న కొమరాడ గ్రామంలో నివసించేవాడిని. మా నాన్నగారు కొమరాడలో టీచర్ గా పనిచేసేవారు. అప్పట్లోనేను కొమరాడకు దగ్గరలో నున్న కోటిపాం హైస్కూల్లో పదవ తరగతి చదివే వాడిని. ఆమె భర్త ( వారికి అప్పటికి వివాహం కాలేదు ) ఎనిమిదో తరగతి చదివేవాడు. చాలా సౌమ్యుడు, రైతు కుటుంబంలో జన్మించినవాడు. ధనికుడు. నేనంటే చాలా అభిమానం చూపేవాడు. చిల్లర వర్తకులు గాజు సీసాలలోను, సిల్వర్ పల్లేల్లో తెచ్చిన తినుబండారాలు అతనికీ , నాకు కొని తెచ్చేవాడు. బాగా చదువు కొని ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాడు. ఈమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళయిన కొన్నాళ్ళకి అతను చనిపోయాడట. ఆ విషయం ఆమె ద్వారా తెలుసుకున్న నేను ఎంతో బాధపడ్డాను. తన పూర్వపు రోజులు తలచుకొని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. ఒకనాడు వీరి కుటుంబం ఆ ఊరుపై ఆధిపత్యం వహించేది. అటు వంటిదీ ఈమె భర్తను పోగొట్టుకోవడంతో ఈనాడు అటెండరు పనిచేయవలసివస్తుంది. అందుకే అంటారు- ఓడలు బండ్లు అవుతాయని. నేనున్న రోజుల్లో ఈమెకు అటెండరు వర్క్ నేర్పించాలని నిర్ణయించుకొని మా లేడీ గుమస్తాను పిలిచాను. ఫైలు నెంబర్, పేరు, ఏ స్థలంలో ఆ ఫైలు ఉంటుంది, దాని అవసరం ఏమిటి అన్న విషయాలుతెలియజెప్పమన్నాను.అంతేకాదు. పరీక్షలకు తెల్లకాగితాలు లెక్కపెట్టి ఇవ్వడం, దారాలను ఆన్సర్ స్క్రిప్ట్ లకు టేగ్ చేసేందుకు కట్ చేయడం, పేపర్స్ పేస్ట్ చెయ్యటం, కాగితాల పుస్తకాలు కుట్టడం, కవర్లు కట్టడం, గుమస్తా, రికార్డు అసి స్టెంట్ ఇచ్చిన ముఖ్యమైన పేపర్లను కవర్లో పెట్టి, కవర్ సీలు చేసి స్టాంపులు అంటించడం,అడ్రసులు వ్రాయడం ఆఫీసులో పనులు అటెండర్ కుచెప్పాలి. పోస్టాఫీసు, బ్యాంకు, ఊరులో పనులు , ఇంకా మగవారు చేయవలసిన బరువైన పనులు నైట్- వాచర్ కు చెప్పమన్నాను. అలా చేస్తే అటెండరుకు పని వస్తుంది అన్నాను. తరువాత గార్డెనర్ ను పిలవమన్నాను. " నీవు ఇక్కడ చేసేపని ఏమిటి ? నీ జీతం ఎంత? నెలకు పదివేలు. సంవత్సరానికి లక్షా ఇరవై వేల పైబడిన నీ జీతానికి తగ్గట్టుగా ఎన్ని మొక్కలు పెంచావు ? పనిచెయ్యకుండా జీతం ఎలా వస్తోందనుకుంటావు ? అని అడిగేసరికి ఇంతవరకూ ఏ హెడ్మాష్టరుగారు చెప్పనేదు బాబూ! అంది. ఇకనుండి నేను చెప్తున్నాను చెయ్యి ! అలా చెయ్యకపోతే జీతం ఉండదు. ఒకటవ తేదీన జీతాలు రావడానికి కరెక్టుగా వారం ఉంది. కనీసం పాతిక మొక్కలైనా జీతాలనాటికి గ్రౌండ్లో ఉండాలి. అలాకాకపోతే జీతం నీకు రాదని చెప్పి స్టాఫ్ ఆర్డర్ వ్రాసాను. అటెండరు స్టాఫ్ఆర్డర్ తీసుకువెళ్లి సంతకం చేయించింది. నా ఆఫీసు రూంకి పది, పదిహేను గజాలదూరంలో ఒక కొబ్బరి చెట్టు ఉంది. దానినింపుగా కాయలు ఉన్నాయి. నైట్- వాచర్ ను పిలిచాను. ఎన్నాళ్ళు నుండి కాయలు కాస్తూందీ చెట్టు అని అడిగాను. మూడు సంవత్సరాలుగా కాస్తుంది. ఎవరో తెంపుకుపోతున్నారు సార్ అన్నాడు. నివ్వు నైట్ వాచ్-మ్యాన్ వు కదా.రాత్రివేళ డ్యూటీ చెయ్యలేదా ? నివ్వు కూడా గార్డెనర్ లాగానే -డ్యూటీ చెయ్యకుండా ఫస్ట్ అయ్యేసరికి జీతం తీసుకుంటున్నావన్నమాట. ఇక నుండి ఈ స్కూలుకు సంబంధించిన ఏ వస్తువు కనిపించకపోయినా నీదే బాధ్యత.ఆ వస్తువు కొని ఇచ్చేవరకూ నీ జీతాన్నంతా ఆపేస్తాను. నీవు తరువాత ఎంత బాధపడినా లాభంలేదు అని చెప్పాను. కొబ్బరి చెట్టుకు ఎన్నికాయలున్నాయో ఇద్దరు టీచర్స్ ను వెళ్లి లెక్కపెట్టి నాకు చెప్పమన్నాను. తరువాత ఆ నైట్-వాచర్ ను వెళ్లి లెక్కపెట్టమన్నాను. లెక్క సరిపడింది అని చెప్పాడు. ఆనాడు కొబ్బరికాయ అయిదు రూపాయలుండేది.ఎన్నికొబ్బరికాయలు పోతే అన్ని ఎనిమిది రూపాయలు వసూలు చేస్తానని చెప్పాను. కొబ్బరికాయ ఖరీదు అయిదు రూపాయలు దానికి అదనంగా మూడు రూపాయలు ఫైన్ ఉంటుందన్నాను. ఉత్తినే సరదాకు అంటున్నాననుకొని చిరునవ్వు నవ్వాడు. నవ్వడంకాదు నిజంగానే . తరువాత బాధపడతావన్నాను. బాధ్యతలెరిగి పనిచేయండి. లేకపోతేచిక్కుల్లో పడతారు అని చెబుతూ స్టాఫ్ ఆర్డర్ ద్వారా విషయాన్ని తెలియజేస్తూ సంతకం చేయించాను.( సశేషం )-శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్: 701 3660 252.
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
భాషా భూషణం ఏసీపి నాగభూషణం!!?:- డా.ప్రతాప్ కౌటిళ్యా.
• T. VEDANTA SURY
చిత్రం : బృంద -ఎనిమిదవ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళిఘనపూర్-మెదక్ జిల్లా
• T. VEDANTA SURY
మా ఊరి చెరువు ( బాల గేయం ) : డాక్టర్. కందేపి రాణి ప్రసాద్
• T. VEDANTA SURY
అమ్మలా పరిపాలించాలి!!;- డా.ప్రతాప్ కౌటిళ్యా
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి