ఆరవేటి రాజకుమార్ రచించిన బాలగేయం వివరణ:-పంచ భూతాలతో(గాలి, నీరు, నిప్పు, నింగి, నేల లతో) మిళితమైన ప్రపంచములో భగవంతుడు మనకు ప్రాణంపోసి భువి సీమలో భారతదేశం పై పంపాడు. భారతమాత బిడ్డలుగా భారతదేశాన్ని, భారతమాతను, తల్లిదండ్రులను, గురువులను దైవంగా భావించాలి. అంతేకాకుండా దైవం మానవునితోపాటు సకల జీవరాశులను వాటికవసరమగు ప్రకృతిని సృష్టించాడు. అమ్మ గర్భము నుండి ధరనిపై అడుగు పెట్టిన మరుక్షణం నుండే పంచ భూతాలపై ఆధారపడుతూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ జీవనం కొనసాగిస్తున్నాము. అందులకే వాటిని ప్రేమిస్తూ,ప్రాణప్రదంగా భావిస్తూ, దైవంగా పూజించాలి అనేవిషయం బాల్యం నుండే మనసులో మొలకెత్తాలి అన్నదే ఈరచన లోని అంతరార్థం.


కామెంట్‌లు