చిన్న , చిన్న చిట్కాలు -3 -- జుట్టు రాలిపోకుండా ఉండాలంటే కొన్ని యెర్రని రిక్క మందారం పూలు తెచ్చి కొద్దిగా పొన్నగంటి కూర + గుంట గలగరాకు తో తైలంగా కాచి వాడుతుండాలి కరివేపాకు తో కూడా తైలం కాచి వాడినా జుట్టు రాలదు .. కాఫీ తాగే వారికి పెద్ద ప్రేవులలో వచ్చే కాలొరెక్టల్ కాన్సర్ రాదు. కాఫీ పొడిలో వట్టి వేళ్ళు వేసి నీరు పోసి కాషాయం చేసి తాగితే మూత్ర పిండాలలో రాళ్లు రాకుండా కాపాడు తుంది. మూత్రాన్ని జారీ చేస్తుంది. కొందరికి తుమ్మినప్పుడు దగ్గినప్పుడు మూత్రం బట్టలలో పడిపోతుంది. అలాంటి వారు సరస్వతి ఆకు పొడి కాషాయం తాగాలి సరస్వతి ఆకు + త్రిఫలా కూడా వాడితే మూత్ర సమస్యలు తగ్గి పోతాయి. కొందరికి మూత్ర పిండాలలో గడ్డలు పెరుగుతాయి అలాంటి వారు బిళ్ళ గన్నేరు పూలు తెల్లవి కానీ గులాబీ రంగువు కానీ 10 పూలు తెచ్చి నీటిలో వేసి మరిగించి కషాయంగా కాచి చల్లార్చి తాగాలి దీనితో పాటుగా గచ్చకాయ పప్పు + 5 మిరియాల పొడి కషాయంగా కాచి తాగితే గడ్డలు పూర్తిగా తగ్గి పోతాయి ఆపరేషన్ అవసరం ఉండదు. -పి .కమలాకర్ రావు


కామెంట్‌లు