సమయస్ఫూర్తి(కథ)డి.కె.చదువులబాబు: --రంగరాజపురంలో రమణయ్య అనే రైతు ఉండేవాడు.అతని కూతురుకు వివాహం నిశ్చయమైంది.బంగారు నగలు కొనటానికి పట్నానికెళ్ళాడు.నగలు కొని ఇంటిదారి పట్టాడు.అప్పటికే చీకటి పడుతుండటంతో త్వరగా ఇల్లుచేరాలని అడ్డదారిన గబగబా నడుస్తున్నాడు.దారిలో గజదొంగ వీరయ్యకత్తితో అడ్డగించాడు."నీ దగ్గరున్న ధనంతీసివ్వు"అన్నాడు.రమణయ్య గజగజ వణుకుతూ "అయ్యా! నా దగ్గర ధనం లేదు.మా అమ్మాయి పెళ్ళి ఉంది.నగలు కొని తెస్తున్నాను.అవి లేకుంటే పెళ్ళి ఆగిపోతుంది.దయవుంచి నన్నువదిలేయండి.మీకు పుణ్యమొస్తుంది"అని ప్రాధేయపడ్డాడు. దొంగ తనపంట పండిందని సంతోష పడుతూ "నువ్వుప్రాణాలతో వెళ్ళాలనుకుంటే నగలివ్వు. నువ్వు ఎంత ప్రాధేయపడినా నేను దయ తో వదలను.నగలివ్వటంతప్ప నీకు మరోమార్గంలేదు."అన్నాడు.రమణయ్య ఏడ్పు ముఖంతో వణికిపోతూచొక్కాలోపల నడుముకు కట్టుకున్న నగల మూట తీసి దొంగ చేతిలో పెట్టాడు.వాడు సంతోషంపట్టలేక మూటవిప్పి చూశాడు.తళతళా మెరిసిపోతున్న పెళ్ళినగలనుచూసి ఉక్కిరిబిక్కిరయ్యాడు.రమణయ్య దొంగతో "అయ్యా!ఓచిన్నమాట చెబుతావినండి.నా ఇంటి పక్కనున్న గోవిందయ్య నాకు బద్దశత్రువు.వాడికీ నాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వాడి కూతురికీ పెళ్ళి నిశ్చయమైంది. రేపు వాడు నగలకోసం పట్నం పోతున్నాడనే విషయం నాచెవినపడింది.రేపు వాడు నగలుకొని ఈదగ్గరి దారిన రావచ్చు.వాడి నగలను కూడా తీసుకోండి. వాడి కూతురి పెళ్ళి కూడా ఆగిపోవాలి."అన్నాడు.వీరయ్య సంతోషపడిపోయి "వాడి నగలను లాక్కుని నీకోరిక నెరవేర్చుతాను."అన్నాడు. రమణయ్య ఇల్లు చేరుకున్నాడు. జరిగిన సంఘటనను భార్యతో చెప్పి"ఇలాంటి దొంగలుంటారనే నేను కొన్ని నకిలీ బంగారు నగలు కొని నడుముకు ఒకవైపు కట్టుకున్నాను.ప్రాధేయపడుతూ భయం,ఏడ్పు నటిస్తూ వాడికి నకిలీబంగారు నగలమూట తీసిచ్చాను. పెళ్ళికోసం కొన్నబంగారు నగలమూట నా నడుముకు మరో వైపు భద్రంగా ఉంది"అనిచెప్పి తీసిచ్చి భద్రపరచమన్నాడు.వెంటనే ఇంటినుండి బయటపడి రాజభటులను కలిసి,జరిగిన సంగతిచెప్పి,"గోవిందయ్య నాకు శత్రువని,రేపు నగలతో ఆదారిన వస్తాడని దొంగకు కట్టుకథ చెప్పాను. మీరు అక్కడ కాపుకాస్తే గజదొంగ దొరుకుతాడు"అని వివరించాడు.మరుసటిదినం భటులు ఆ దారిలో మాటు వేసి దొంగను బంధించారు. ఊరందరూ రమణయ్య ముందుచూపును,సమయస్ఫూర్తిని అభినందించారు. డి.కె.చదువులబాబు. 3/528.వై.యం.ఆర్.కాలనీ.ప్రొద్దుటూరు.516360.కడప జిల్లా. 9440703716
Popular posts
భాషా భూషణం ఏసీపి నాగభూషణం!!?:- డా.ప్రతాప్ కౌటిళ్యా.
• T. VEDANTA SURY
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
చిత్రం : బృంద -ఎనిమిదవ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళిఘనపూర్-మెదక్ జిల్లా
• T. VEDANTA SURY
రామాయణం నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
• T. VEDANTA SURY
మా ఊరి చెరువు ( బాల గేయం ) : డాక్టర్. కందేపి రాణి ప్రసాద్
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి