చీమ - దోమ ఒక చీమ ఉంది. పని చేసుకుంటుంది.అప్పుడు ఒక దోమ వచ్చింది. చీమా నువ్వు ఎగరలేవు నేను ఎగరగలను అని గర్వంగా అంది.వెక్కిరించింది.చీమకు కోపం వచ్చింది. నాకు ఇల్లుంది నీకు ఇల్లు లేదు అని దోమకు జవాబు ఇచ్చింది. ఆ రెండూ వాదులాడుకోడం ఒక ఎలుక చూసింది. దగ్గరకు వచ్చి ఆ కనిపిస్తున్న మనిషిని ఎవరు కుడతారో వారే గొప్ప అన అంది.చీమ కారణం లేకుండా కుట్టనంది.దోమ నేను కుడతాను అని ఎగిరింది. మనిషి మీద వాలింది. మనిషికి చిరాకు వచ్చింది. ఒక్కటిచ్చాడు.దోమ చచ్చింది. గర్వం పనికి రాదు.నీ పని చూసుకో చీమా అని ఎలుక పారిపోయింది. బెలగాం వేద కుందన 3 వ తరగతి సైన్స్ పార్క్ స్కూల్ హైదరాబాద్


కామెంట్‌లు