చిన్న చిన్న చిట్కాలు -4 -- రోగ నిరోధక శక్తి పెరగాలంటే 10 తులసి ఆకులను ముఖ్యంగా కడిగి నమిలి తినాలి. దీనితో శరీరం లోని కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. కాలిన పుండ్లపై కలబంద గుజ్జు రాస్తుంటే త్వరగా మాని పోతాయి. ముఖంపై ఏర్పడే నల్లని మచ్చలు కలబంద గుజ్జులో వెన్న కలిపి ముఖం పై లేపనంగా వేసికుంటే ముఖం కాంతి వంతంగా తయారవుతుంది. తెల్ల మచ్చలు పోవాలంటే అడవి చెన్నంగి ఆకు లేక కసివింద ఆకుల రసాన్ని ప్రతి రోజు తెల్ల మచ్చలపై రాస్తూ ఉంటె మంచి గుణం ఇస్తుంది. విరిగిన ఎముకలకు కూడా అడవి చెన్నంగి ఆకుల రసం తో కోడిగుడ్డు సోన కలిపి పట్టి వేస్తె త్వరగా అతుక్కుంటాయి. విరిగిన ఎముకలు అతుక్కోవడానికి తంగేడు ఆకులను మొత్తగా నూరి కోడి గుడ్డు సోనా కలిపి కట్టుగా ఉంచితే త్వరగా అతుక్కుంటాయి అతిపత్తి ఆకు రసాన్ని బోదకాలు వాపు పై రాస్తే తగ్గి పోతుంది. - పి . కమలాకర్ రావు


కామెంట్‌లు