సుమతీ శతకం ౪౨(42)వ పద్యం. తన వారు లేనిచోటను జనమించుక లేనిచోట జగడము చోటన్ అనుమానమైన్న చోటను మనుజునకును నిలువదగదు మహిలో సుమతీ! తా : ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ .... తన సబంధీకులు లేనిచోట, అసలు జనులే లేనిచోట, జనాలు కొట్టుకుంటూ హింస జరుగుతూ పెరుగుచున్న చోట, పరిస్థితులు అనుమానంగా వున్నచోట, ఇటువంటి చోట్లలో సంఘజీవి ఐన మనిషి ఉండకూడదు .......... ....అని సుమతీ శతకకారుని వాక్కు. *సంఘ జీవనానికి అలవాటు పడిన మనిషి ప్రశాంతంగా ఉంటూ, శాంతి తో రక్షణాత్మక జీవనం గడపాలి అని భావం.* ....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss


కామెంట్‌లు