సుమతీ శతకం ౪౬(46)వ పద్యం. తాను భుజింపని యర్ధము మానవపతిఁ జేరుఁగొంత మరి భూగతమౌఁ గానల నీఁగల గూర్చిన దేనియ యెరుఁజేరునట్లు తిరగమున సుమతీ! తా : ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ .... తేనెటీగలు ఎంతో శ్రమ చేసి తాము చేసుకున్న తేనెపట్టు లో తేనెను కూడ పెడతాయి. కానీ ఆ తేనె చెట్టు లేదా మనుషుల పరమౌతుంది. కానీ తేనెటీగలు ఆ తేనెను అనుభవించ లేవు. అలాగే, లోభి తనసంపాదన అంతా తనకే చెందేటట్టుగా దాచుకువాలి అనుకుంటాడు. కానీ, ఆ సంపద చివరికి రాజు/ప్రభుత్వ పరం అవుతుంది.............. ....అని సుమతీ శతకకారుని వాక్కు. *మనం సంపాదించిన ధనం లో మన అవసరాలకు సరిపడా వుంచుకొని, మిగిలిన దానిలో కొంతైనా దాన ధర్మాలు చేయాలి అని భావం.* ....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss


కామెంట్‌లు