సుమతీ శతకం ౪౭(47)వ పద్యం. దగ్గర కొండెము సెప్పెడు ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుఁడై మరితా నెగ్గుఁబ్రజ కాచరించుట బొగ్గులకై కల్పతరువు బొడుచుట సుమతీ! తా : ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ ... రాజు తన మంత్రి చెప్పే మాటలలో ఎంత వరకు నిజాలు ఉన్నాయి, ఆ మాటలు ప్రజలకు మేలు చేస్తాయా చేయవా అని విచారించకుండా మంత్రి సలహాలన్నీ రాజ్యం లో అమలు చేస్తే ప్రజలకు నష్టం, ఇబ్బంది కలుగుతుంది. ఎలా అంటే, కోరిన కోరికలను తీర్చే కల్పతరువునో, మంచి గంధపు చెట్టునో వంటచెరకు కోసం నరికి నట్లు....... ....అని సుమతీ శతకకారుని వాక్కు. *రాజులు, అధికారం చేతిలో ఉన్నవాళ్ళు తాము నిర్ణయాలు చేసేటప్పుడు తాము చేసే నిర్ణయం వల్ల ఎక్కవ జనాభా కు మేలు జరిగే విధంగా అలోచించి నిర్ణయించాలి. చెప్పుడు మాటల ప్రభావం తాము చేసే నిరణయాల మీద పడకుండా జాగ్రత్త వహించాలి అని భావం.* ....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss


కామెంట్‌లు