సుమతీ శతకం ౪౮(48)వ పద్యం. ధనపతి సఖుఁడై యుండియు నెనయంగా శివుడు భిక్షమెత్తగవలసెన్ దనవారి కెంత గలిగిన దన భాగ్యమె తనఁకుగాక తధ్యము సుమతీ! తా : ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ ... వేంకటాచలపతికే అప్పిచ్చినవాడు కుబేరుడు. ఈ కుబేరుడు పరమశివుని చెలికాడు, సన్నిహితుడు. కానీ పరమశివుడు బిచ్చమెత్తాడు కదా. అందువల్ల, మనము సంపాదించిన సంపద మాత్రమే మనకు సహాయ పడుతుంది కానీ, మన మిత్రుల వద్ద, బంధుగుల వద్ద వున్న సంపద మనకు అక్కరకు రాదు ....... ....అని సుమతీ శతకకారుని వాక్కు. *అయ్యలారా!! ఎవరి ధనార్జన వారే చేసుకోవాలి. ఆ సంపద ఐహికమైన దైనా, పారలౌకిక మైనదైనా. నువ్వు చేసుకున్న పుణ్యం మాత్రమే నీకు చెల్లతుంది. నీవు నడిపించిన ధర్మమే నీకు ధర్మ మార్గాన్ని చూపిస్తుంది. నీ కుటుంబ సభ్యులో, సన్నిహితులో పుణ్యం సంపాదించుకుంటే, ధర్మ మార్గాన నడిస్తే నీకు ఏమీ ఉపయోగ పడదు. ఎందుకంటే వచ్చేడప్పుడు, వెళ్లేటప్పుడు మనం ఒంటరే కాబట్టి, అని భావం.* ....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss


కామెంట్‌లు