సుమతీ శతకం ౪౯(49)వ పద్యం. ధీరులకుఁ జేయు మేలది సారంబగు నారికేళ సలిలము భంగిన్ గారవమును మరిమీదట భూరి సుఖావహము నగును భువిలో సుమతీ! తా : ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ ... ఈ భూమి మీద ధైర్యవంతుడికి, బుద్ధి మంతునికి చేసే మేలు/సహాయం కొబ్బరి బోండంలోని నీరులాగా స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంటుంది. ప్రేమతో కూడి వుంటుంది. ఎంతో గౌరవాన్ని, సుఖాన్ని కూడా కలగ చేస్తుంది ....... ....అని సుమతీ శతకకారుని వాక్కు. *కృష్ణ పరమాత్మ పాండవులకు చేసిన సహాయం, ప్రియ చెలికాడు, అసహాయ శూరుడు ఐన పార్ధునికి చేసిన సహాయం ఇటువంటిదే.* *మనం కూడా మన దైనందిన జీవితంలో, కార్యాలయంలో ఎంతో నమ్మకంగా, సాహసంతో నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకుంటూ పనిచేసే వారికి ఇతోధికంగా మన మాట, ఆలోచన, చేతలతో సహాయం చేయాలి అని భావం.* ....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss


కామెంట్‌లు