వీర హనుమ -- (గేయము) రామబంటు హనుమంతుడు శక్తిమంతుడు కొండనైన పిండిచేయు బలవంతుడు అంజనీదేవికి ముద్దు పుత్రుడు పవనసుతుడు మారుతీ ఘనవీరుడు ధైర్య సాహసాలున్న రణధీరుడు దాశరథినె గుండెలో నిలిపినాడు సూర్యున్నే పండనుకొని మ్రింగ చూసెను సకల విద్యలన్ని నేర్చి వెలిగిపోయెను సీత కొరకు వెతికేటి రాముడికి హనుమన్న కలిసినాడు వనసీమలో మాయమ్మ సీతమ్మను వెతుకుతానని మాట ఇచ్చి కదిలినాడు జాడచూడగా సముద్రుడిని దాటివెళ్ళి లంకచేరెను చెట్టుకింద సీతమ్మను తాను చూసెను నిప్పంటిన తోకతో లంక తిరిగెను లంకేశుడి గర్వమణచ లంక కాల్చెను తిరిగి వచ్చి రామయ్యకు తోడు నిలిచెను వారధిపై వానరులను లంక చేర్చెను రక్కసులతొ యుద్ధమాడి బలము చూపెను మూర్ఛిల్లిన లక్ష్మయ్యకు సంజీవినిచ్చెను రామయ్య చేతిలో రావణుడు మరణించిన నిముషమే హనుమంతుడు రామ రామ రామయని కీర్తించెను రామసీత సేవకే తాను నిలిచెను. పద్మ త్రిపురారి జనగామ. (చిన్నారుల స్థాయిననుసరించి వాక్యాలు కుదించి నేర్చుకోవడానికైనా వీలుగా రాయబడిన గేయము ఇది.)


కామెంట్‌లు