చిన్న చిన్న చిట్కాలు - 5- చిన్న పిల్లలలో జ్ఞాపక శక్తి పెరగాలంటే సరస్వతీ ఆకుల రసాన్ని ఆవు నేతిలో కొద్దిగా వేయించి పాలు చక్కర వేసి ప్రతి రోజు తాగించాలి. పిల్లలలో క్రమంగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మానసిక వ్యాధులతో కూడా సరస్వతీ ఆకుల చూర్ణాన్ని పాలతో సేవించాలి. నరాల బలహీనతలో సరస్వతీ చూర్ణాన్ని +అశ్వగంధ పొడిని పాలతో కలిపి తాగుతుంటే నరాలు శక్తి వంతమవుతాయి .శరీరం బలంగా తయారవుతుంది పాలు విరిగి పోకుండా ఉండాలంటే పచ్చి పాలలో 4,5 పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి వేసి కాచుకుని వాడుకోవాలి .పత్తి గింజలను వేయించి పొడి చేసి పళ్ళు తోముకుంటే దంత వ్యాధులు రావు శోభి అని పిలిచే తెల్ల మచ్చలు పోవాలంటే పత్తి గింజలను నీటిలో నూరి తెల్ల మచ్చల పై పూతగా పూస్తే క్రమంగా తగ్గి పోతాయి. పి . కమలాకర్ రావు


కామెంట్‌లు