సుమతీ శతకం ౫౦(50)వ పద్యం. నడువకుమీ తెరుఒక్కటఁ గుడువకుమీ శత్రునింటఁ గూరిమితోడన్ ముడువకుమీ పరధనముల నుడువకుమీ నొరుల మనసు నొవ్వగ సుమతీ! తా : ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ ... ఒక్కడివే ఒంటరిగా ఎక్కడికి ప్రయాణము చేయకు. ఎంత అప్యాయతతో, ప్రేమతో పెట్టిన భోజనమైన శత్రువుని ఇంట భోజనము చేయకు. వేరేవాళ్ళ సంపదని నీదనుకుని లెక్కించి నీ వద్ద ఉంచుకోకు. ఎదుటివారి మనసు బాధపడేటట్టుగా ఎప్పుడూ మాట్లాడకు. ....... ....అని సుమతీ శతకకారుని వాక్కు. మనిషి సంఘ జీవి. సంఘంలో మనం ఎలా ఉండకూడదో ఈ పద్యంలో శతకకారుడు చెప్పారు. ....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss


కామెంట్‌లు