సుమతీ శతకం ౫౫(55)వ పద్యం. నవ్వకుమీ సభలోపల నవ్వకుమీ తల్లిదండ్రి నాధులతోడన్ నవ్వకుమీ పరసతితో నవ్బకుమీ విప్రవరుల నయమున సుమతీ! తా: ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ... సభలలోను, తల్లిని, తండ్రిని, భర్తను/రాజును/పై అధికారిని, ఇతరుల భార్యను, బ్రాహ్మణులు/పురోహితులను చూచి అనవసరంగా నవ్వకూడదు... ....అని సుమతీ శతకకారుని వాక్కు. *నవ్వు నాలుగు విధాలచేటు* అనే నానుడి వుంది కదా😊. *అందుచేత, అవసరం వున్నా లేకున్నా నవ్వడం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయి అని భావం.* ....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss


కామెంట్‌లు