ఈ చిట్టి తల్లి పేరు షణ్ముఖ వేద నాన్న వేణుగోపాల్ అమ్మ నాట్యగురువు తులసి పోపురి శ్రీనిధి గ్లోబల్ స్కూల్ లో మూడవ తరగతి చదువుతుంది పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా చిన్నారి వేద నాలుగేళ్ల చిరుప్రాయంలోనే తల్లి వద్ద శిక్షణ పొందుతూ పలు వేదికలపై ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది నాట్య ప్రాముఖ్యాన్ని తెలుపుతూ ఈ మధ్యన జరిగిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పలు కళాకారులతో ప్రదర్శన కూడా ఇచ్చింది చదువు నాట్యంతో పాటుగా వైలెన్ వాసుదేవన్ గారి వద్ద ఆరు నెలలుగా వైలెన్ నేర్చుకుంటుంది గురుకులంలో అందరితో ఇలా శిక్షణ పొందడం ఎంతో ఆనందంగా ఉంటుంది అని చెప్పింది చిన్నారి వేద నృత్యంలో శిక్షణ పొందుతూనే నాట్యం ప్రాముఖ్యాన్ని పలు దేశాల్లో విస్తరింప చేయాలని వేద యొక్క కోరిక


కామెంట్‌లు