సుమతీ శతకం ౫౭(57)వ పద్యం. పతికడకుఁ దన్నుగూర్చిన సతికడకును వేల్పుకడకు సద్గురు కడకున్ సుతకడకు రిత్త చేతుల మతిమంతులు చనరు నీతిమార్గము సుమతీ! తా: ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ భూమి మీద నీతిమంతులు, బుద్ధి మంతులు అయినవారు, భర్త, భార్య, భగవంతుడు, గురువు మరియు కొడుకు దగ్గరకు వెళ్ళేటప్పుడు వుత్తి చేతులతో వెళ్ళరు..... ....అని సుమతీ శతకకారుని వాక్కు. *పత్రం, పుష్పం, ఫలం, తోయం* అని నానుడి మనకు వుంది కదా. మన స్థాయిని బట్టి వారి వారి దగ్గరకు వెళ్లేటప్పుడు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, పసిపిల్లల దగ్గరకి వెళ్లేటప్పుడు కూడా, ఏదో ఒకటి తీసుకు వెళ్ళాలి అని భావం. ....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss


కామెంట్‌లు