సుమతీ శతకం ౫౮(58)వ పద్యం. పని చేయునెడల దాసియు ననుభవమున రంభ మంత్రి ఆలోచనలన్ దనభుక్తి యెడలఁ దల్లియుఁ ననఁ దన కులకాంత యుండనగురా సుమతీ! తా: ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ మన మానవ సమాజంలో భార్య, తన ఇంట్లో పని చేసెకునేడప్పుడు పనిమనిషి లాగా, తన భర్త దగ్గర రంభ లాగా, ఇంటి సంబంధమైన విషయాలోచనలో మంత్రి లాగా, భర్తకు భోజనం పెట్టేటప్పుడు తల్లి లాగా తనను తాను భావించుకుని ప్రవర్తించాలి ..... ....అని సుమతీ శతకకారుని వాక్కు. *కార్యేషు దాసి, కరణేషు మంత్రి, శయనేషు రంభ, భోజ్యేషు మాత* అనే చాలా ప్రచులితమైన వాక్యాన్ని సుమతీ శతకకారులు తెలిగించారు ఇక్కడ. *మన సమాజంలో నూటికి 99% ఆడవాళ్ళు ఈ ప్రకారంగా ఉంటున్నారు. అందువల్లే మన కుటుంబ వ్యవస్థ చెక్కు చెదరకుండా వుంది. అలాంటి స్త్రీ మూర్తులు అందరికీ, మనః పూర్వకంగా శిరస్సువంచి పాదాభివందనం. భార్య లేక వంటరి జీవితం గడుపుతున్న భర్తలను అడిగితే తెలుస్తుంది, మన జీవితంలో భార్యల విలువ.* ....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss


కామెంట్‌లు