ఈ చిన్నారి చెల్లి పేరు ప్రజ్ఞ సంజిత, అమ్మ మల్లిక , నాన్న కృష్ణ, మహారిషి విద్యామందిర్ లో 6 వ తరగతి చదువుతుంది, గత ఐదు సంవత్సరాలుగా గురుకులం లో వయోలిన్ వాసుదేవన్ గా, రి వద్ద కర్నాటక సంగీతం , తులసి పోపూరి గారి వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకుంటుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సంగీతం నృత్యం నేర్చుకోవడం మొదలు పెట్టింది. 6 సంవత్సరాల వయసు లొనే సంగీతం , నాట్యం లో ఓనమాలు దిద్దిన సంజిత ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటుంది.గురుకులం లో వాతావరణం పిల్లలకు విద్య నేర్చుకోవడానికి ఎంతో బాగుంటుంది అంటుంది చిన్నారి సంజిత.గురుకులం ద్వారా తనూ సంగీత కచేరి నాట్య ప్రదర్శన ఇచ్చే అవకాశం పొందింది. సంగీతం నృత్యం లో ఇంకా ఎంతో నేర్చుకుని ముందుకి సాగాలన్నది సంజిత కోరిక అంతే కాదు చిత్రలేఖనం ఇతర కళలలో ఎంతో ఆసక్తి వుంది. చదువుతో పాటు కళలలో కూడా ప్రావీణ్యం పొందాలి అన్నది సంజిత కోరిక.


కామెంట్‌లు