ఈరోజు తాళ్లపాక అన్నమాచార్యుని 612వ జయంతి,, బుద్ధ జయంతి. వైశాఖ పౌర్ణమి నాడు*తెలుగు సాహితీ చరిత్రలో తనకంటూ ఒక చరిత్ర లిఖించుకుని తొలి తెలుగు వాగ్గేయకారుడిగా, పదకవితా పితామహుడు అన్నమయ్య జయంతి నేడు. ఆయన పూర్తి పేరు తాళ్ళపాక అన్నమాచార్యులు.**అన్నమాచార్యులను అంతా వైష్ణవ భక్తుడిగానే చూశారు. వేంకటేశ్వర స్వామిపై ఆయన రాసిన సంకీర్తనలే అందుకు కారణం. కానీ, ఆయన వ్యక్తిత్వ వికాశ పాఠాలు బోధించిన ఓ గొప్ప గురువు. ఒక మనిషి జీవితం ఎలా ఉండాలో.. ఒక మనిషి ఎలా మెలగాలో చాటి చెప్తూ ఆయన రాసిన కీర్తనలు, రచనలు ఎన్నో ఉన్నాయి. వ్యక్తిత్వం వికాసానికి సరియైన మార్గదర్శి.*అంతెందుకు ‘బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మమొక్కటే *…” అంటూ ఆయన రాసిన గొప్ప సంకీర్తన అర్ధం ‘మనుషులంతా సమానమేనని’ చెప్పే ప్రయత్నం. ఇందులో సామాజిక కోణం దాగి ఉంది. ఊరూరా తిరుగుతూ ఆయన చేసిన కవితలలో జీవన అర్థం, సామాజిక పరమార్థం దాగి ఉన్నాయి.**“మహినుద్యోగి కావలె మనుజుడైన వాడు**సహజి వలె నుండి ఏమి సాధింపలేడు!”* అంటూ అన్నమయ్య రాసిన సంకీర్తన నేటికీ ప్రతి మనిషిలోనూ ఓ కొత్త ఉత్తేజం నింపుతుంది. ఈ కీర్తన ద్వారా *“ఈ లోకంలో మనిషన్నవాడు ఉద్యోగి కావాలి”* అని చెప్పుకొచ్చాడు అన్నమయ్య. *“ఉద్యోగి” అంటే “ఉద్యోగం చేసేవాడు” అని అర్ధం కాదు. ఆయన భావంలో “ఉద్యోగి” అంటే “ఉద్యమించే వాడు” అని అర్థం. కార్యసిద్ది కోసం ప్రయత్నించేవాడు,* ఆ క్రమంలో ఎదురయ్యే కష్టాలకుకృంగిపోకుండా పాటుపడే వాడు అని అర్ధం. “ *వేడుకతో చదివితే వేదశాస్త్ర సంపన్నుడౌ* *జాడతో నూరకుండితే జడుడౌను!* *ఓడక తపసియైతే ఉన్నతోన్నతుడౌ* *కూడక సోమరి ఐతే గుణహీనుడౌను!”* అన్నమయ్య చేతి నుండి జాలు వారిన ఈ శ్లోకం భావం *“శ్రద్ధతో చేస్తేనే కార్యాలు పూర్తవుతాయని, మొక్కుబడిగా ప్రయత్నిస్తే ఫలితం ఉండదని..”* శ్రద్ధగా చదివితే వేదశాస్త్ర పారంగతుడివి అవుతావు, నామమాత్రంగా చదివితే మూర్ఖుడిగా మిగులుతావు” అంటున్నాడు అన్నమయ్య. తపస్సు సాధించాలంటే మనలోని శక్తియుక్తులన్నీ “ *కూడబెట్టి” పరిశ్రమించాలి. సోమరులకి దక్కేది కాదిది. అందుకే “సోమరిగా ఉంటే గుణహీనుడివి అవుతావు”* అని పలికాడు అన్నమయ్య. అనాడే చదువు విలువ ఏమిటో, మనిషిలో ఎంతటి మార్పును తీసుకు వస్తుందో తన పదకవితలతో చక్కగా చెప్పాడు అన్నమయ్య. *ఆయన శ్రీ మహావిష్ణువు భక్తుడిగానే కాకుండా.., ఒక మనిషి జీవితంలో వచ్చే నవరసాల భావో ద్వేగాలను కూడా తన రచనలలో ఆనాడే పరిచయం చేశాడు.* తరాలు మారినా.. యుగాలు- మారినా.. వేంకటేశ్వర స్వామి ఉన్నంత కాలం అన్నమయ్య స్థానం పదిలం *ఇలా వైశాఖ పౌర్ణమి నాడు అన్నమయ్య జయంతి ,బుద్ధ జయంతి లను జరుపు కోవటం తెలుగు వారి అదృష్టం .*- పల్లం రాజు మల్యాల
Popular posts
భాషా భూషణం ఏసీపి నాగభూషణం!!?:- డా.ప్రతాప్ కౌటిళ్యా.
• T. VEDANTA SURY
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
చిత్రం : బృంద -ఎనిమిదవ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళిఘనపూర్-మెదక్ జిల్లా
• T. VEDANTA SURY
రామాయణం నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
• T. VEDANTA SURY
మా ఊరి చెరువు ( బాల గేయం ) : డాక్టర్. కందేపి రాణి ప్రసాద్
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి