కవిత:-తేనీరు..(సిరా మాటలు ) -లిఖిత్ కుమార్ గోదా కవితలు సలసల కాలుతుంది తేనీరు (ఛాయ్) సలసల కాలే దాన్ని పోసానో పేపర్ గ్లాసులో అబ్బా! పట్టుకుంటే చర్మం సైతం ఉండేటట్టుంది పెదవులపై పెడితే పెదాలు సైతం లావా పేలినట్టు పేలిపోయేట్టుంది. నాలుక మీద పడితే "నాలుక డాక్టర్" దగ్గరికి వెళ్లాల్సి వస్తుందేమో. పట్టుకుంటేనే 'అమ్మో' అన్న ఐదు అడుగుల భారీ శరీరం కలిగి ఉన్న నేను, పెదవులపై పెట్టుకుంటేనే ఆ వేడికి పాతాళం దాకా అరిచిన నేను, ఆ తేనీరు వేడిని తట్టుకుంటున్న ఐదు సెంటీమీటర్ల పేపర్ గ్లాస్ ను చూసి సిగ్గు పడుతున్నాను. అది జీవి కాదు; దానికి జీవం లేదు, నలిపేస్తే నలిగిపోయే ఆ పేపర్ గ్లాసు అంతటి వేడిని ఎలా భరిస్తుంది? ఆ పేపర్ గ్లాస్ ను చూస్తూ, దాని ముందు నేను నలిగిపోయాను, గాలికి ఎగిరిపోయాను, చతికిలబడిపోయాను, ముడుచుకున్నాను. ఇంతలో తేనీరు చల్లారడంతో ఆ పేపర్ క్లాస్ కి జోహార్లు కొడుతూ ఓ సిప్ వేశాను. -రచన: లిఖిత్ కుమార్ గోదా.


కామెంట్‌లు