9.ప్రయివేట్ గా డిగ్రీ చదువులు--నా దృష్టి ఉన్నత చదువుల పైకి వెళ్ళింది. ఆ రోజుల్లో ప్రయివేటు గా డిగ్రీ చెయ్యాలంటే22 సంవత్సరాలు దాటాలి.1972 కి నా వయస్సు 20సం.లు. రెండు సంవత్సరాలు ఆగేను.నాన్న గారు ఎగ్జమ్షన్ ఫీజు రు.75లు కట్టారు.నాన్నగారిచ్చే పోకట్ మనీ నా చదువు కొనసాగించడానికి చాలదు.ఆ సమయంలో సాయంత్రం హౌస్ ట్యూషన్లు చెప్పి పుస్తకాలు, ఫీజులకు ఇబ్బందిలేకుండా చేసుకోగలిగాను.1974-75 నుంచి1976-77 వరకు ఆంధ్రవిశ్వవిద్యాలయం బి.ఏ.డిగ్రీ స్పెషల్ తెలుగుతో చేశాను.తరువాత 1977-78 నుంచి 1978-79 వరకు ఎం.ఏ.తెలుగుచేశాను. ఎం.ఏ.తెలుగు చేస్తున్నప్పుడు ఇద్దరు రచయితల సాన్నిహిత్యం లభించింది. ఆ ఇద్దరిలో ఒకరు శ్రీ పంతులు జోగారావు మరొకరు శ్రీ పి.వి.బి.శ్రీరామమూర్తి .అప్పటికే ఆ ఇద్దరు తెలుగు కథాసాహిత్యంలో వెలిగిపోతున్న రచయితలు.తెలుగు వారపత్రికలు, మాసపత్రికలలో తరచుగా వారి కథలు వస్తుండేవి.వాళ్ళ పరిచయ భాగ్యంనాకు కలిగింది.ముగ్గురం ఎం.ఏ.రెండవ సంవత్సరంలో ఉండే అభిజ్ఞాన శాకుంతలం గురుముఖతః విని నేర్చుకోడానికి ఆ రోజుల్లోసంస్కృత పాఠశాలలో సంస్కృత భాషా పండితులుగా పని చేస్తుండే శ్రీ గుడిమెట్ల కృష్ణమూర్తి గారి వద్దకు వెళ్ళేవారం.రాత్రి 8గం.కుఆయనకు వీలయ్యేది.ఆ సమయంలో మేము ముగ్గురం మాష్టారు ముందు కూర్చొని అభిజ్ఞానశాకుంతలం వినేవారం. ప్రముఖ రచయితల మధ్య కూర్చునే ఆ అదృష్టం నేను ఇప్పటికీ మరచి పోలేను.మరొక విషయం ఈ సందర్భంగా చెప్పవలసి ఉంది.బొబ్బిలి విజ్ఞాన వివర్ధిని సంస్థ వారు 1990 దశకంలో ప్రకటించిన సాహిత్య పురస్కారాలను ముగ్గురం అందుకున్నాం. ఎం.ఏ.పరీక్షల సందర్భంగా తెలుగు వ్యాకరణం శ్రీ అనుపోజు లక్ష్మణరావు గారి వద్దనేర్చుకున్నాను ఈ విధంగా నా బి.ఏ. మరియు ఎం.ఏ. డిగ్రీల చదువు పూర్తయింది. బి.ఇడి.కరస్పాండెన్స్ కోర్స్ ను ఆంధ్ర విశ్వవిద్యాలయం అప్పటికి మొదలుపెట్టలేదు. (సశేషం)--బెలగాం భీమేశ్వరరావ 9989537835


కామెంట్‌లు